NTV Telugu Site icon

Canada: భారత్‌తో సంబంధాలపై కెనడా రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

Canada

Canada

ప్రస్తుతం కెనడా- భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఖలిస్తాన్ వివాదం రెండు దేశాల మధ్య రగులుతూనే ఉంది.  సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైన విషయం తెలిసిందే. దీంతో భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Delhi: పదో తరగతి బాలుడిపై నలుగురు టీచర్లు దాడి.. తీవ్ర గాయాలు

ఈ నేపథ్యంలో కెనడా  కెనడా రక్షణ శాఖ మంత్రి బిల్ బ్లెయిర్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. భారత్‌తో రక్షణ సంబంధాలు తమకెంతో ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘ది వెస్ట్ బ్లాక్’  అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్యపై జరుగుతుందని తెలిపిన ఆయన ఇతర అంశాల్లో రెండు దేశాల భాగస్వామ్యం కొనసాగడం అవసరమని పేర్కొన్నారు. తమ దేశ భూభాగాన్ని, చట్టాలను, పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్న మంత్రి బిల్ బ్లెయిర్ నిజ్జర్ హత్య తమకు సమస్యాత్మకంగా మారిందన్నారు. ఇక ఈ కేసులో ఉన్న ఆరోపణలు నిజమని తేలితే ఇది ఒక ఆందోళనకరమైన అంశంగా మారుతుందన్న ఆయన ఇండో పసిఫిక్ వ్యూహానికి కెనడా ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని చెప్పుకోచ్చారు. అయితే ఈ విషయంలో అమెరికా కూడా కొంత సమాచారాన్ని కెనడాకు అందించినట్లు వార్తలు వచ్చాయి.

ఈ ఆరోపణలను ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలు ఖండించాయి. రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని ఇతర దేశాలు కోరుతున్నాయి. ఇక ఈ వివాదం నేపథ్యంలో కెనడా ప్రభుత్వం భారత రాయబారిని దేశం నుంచి బహిష్కరించడం, భారత్ కూడా కెనడా దౌత్య అధికారిని దేశం నుంచి బహిష్కరించడం లాంటివి చేశాయి. ఈ నేపథ్యంలోనే ఖలిస్తాన్ తీవ్రవాదులు కూడా కెనడాలో ఉన్న భారతీయులను భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా భారత్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించిన విషయం కూడా తెలిసిందే.