ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది.. అందుకే చాలా మంది నీళ్లు, మజ్జిగతో పాటుగా కొబ్బరి బొండాలను కూడా తాగుతారు.. కొబ్బరి నీళ్లను రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..
కొబ్బరినీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.. జీర్ణ క్రియను మెరుగు పరిచేందుకు ఇవి సహాయపడతాయి.. కొబ్బరి నీళ్లల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అందుకే వీటిని తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు..
ఈ కొబ్బరి నీళ్లలోని సమ్మేళనాలు జీవక్రియని పెంచడానికి సాయపడతాయి. ఇవి ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తాయి. బరువుని స్పీడ్‌గా తగ్గిస్తాయి. కొబ్బరినీటిని తీసుకుంటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. శరీరం హైడ్రేట్ అయినప్పుడు నీరసం రాదు.. వర్కౌట్స్ చేసే ముందు కొబ్బరి నీళ్లు తాగితే చాలా మంచిదని చెబుతున్నారు.. ఎందుకంటే ఎక్కువ సేపు అలసట లేకుండా ఉంటుంది.. దాంతో ఎక్కువసేపు వర్కౌట్స్ చేస్తారు.. కొబ్బరినీరు తాగితే అందులోని పదార్థాలు ఎక్కువసేపు పొట్ట నిండుగా అనిపించేలా చేస్తుంది.. దానివల్ల ఎక్కువగా తినకుండా ఉంటారు.. సులువుగా బరువు తగ్గుతారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.