Health News: వానకాలం వచ్చిందంటే చాలు రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జర్వాలు, జలుబు బారిన పడుతూ ఉంటాం. ఈ కాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌లాంటి విషజ్వరాలు ఎక్కువగా వస్తాయి. మాములు వారు అనారోగ్యం బారిన పడితే మందులు వాడుకోవచ్చు. అయితే బిడ్డలకు పాలివ్వాల్సిన బాలింతలు జ్వరం బారిన పడితే ఎలాంటి మందులు వాడాలి? ఆ సమయంలో పిల్లలకు పాలివచ్చా? లాంటి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి.
బాలింతలు వాడకూడని మందులు: బాలింతలకు జ్వరం వస్తే ముఖ్యంగా యాంటీబయాటిక్స్, టెట్రాసైక్లిన్ గ్రూపులకు సంబంధించిన మందులు వాడకూడదు. రెండు రోజులైనా జ్వరం తగ్గకపోతే అది ఆమె ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అందుకే బాలింతలు జ్వరం వచ్చినపుడు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి. డాక్టర్ సూచించిన మందులనే వినియోగించాలి.
బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పురుడు తరువాత బాలింతలు మరణిస్తున్న కేసుల్లో మూడోవంతు మరణాలు ఇన్‌ఫెక్షన్ల వల్లే కలుగుతున్నాయి. అందుకే బాలింతలు, బిడ్డలకు పాలిచ్చే ఏ తల్లులైనా బయట ఆహారాన్ని చాలా వరకు తగ్గించాలి. కాచి చల్లార్చిన నీళ్లనే తాగాలి. తమ ప్లేట్లు, స్పూన్లు విడిగా ఉంచుకోవాలి. నీటిని అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే బిడ్డకు పాలివ్వడం ద్వారా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. గుంపులో తిరగకుండా ఉండటం ద్వారా వైరల్ ఫీవర్స్ వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు.
Also Read: Tetanus Shot : దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ అవసరమేనా? మీ కోసమే పూర్తి వివరాలు?
జర్వం వచ్చినప్పుడు బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?: ఓపిక ఉందీ అనిపిస్తే ఏ జ్వరం అయినా సరే.. బిడ్డకు నిరభ్యంతరంగా పాలు ఇవ్వొచ్చు. అయితే ఆ సమయంలో బేబీకి జ్వరం రాకుండా మాస్క్ పెట్టుకోవాలి. బిడ్డను ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే నోటి ద్వారా బిడ్డకు వైరస్ సోకే అవకాశం ఉంటుంది. పొరపాటున తుమ్మినా, దగ్గినా చేతులు వెంటనే కడుక్కోవాలి. ఆ తరువాతనే బిడ్డను తాకాలి.