Health News: వానకాలంలో ఆకు కూరలు తినకూడదా? దీనిలో నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే వర్షాకాలంలో వీటిని తినకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఆకు కూర మొక్కలు భూమి నుంచి తక్కువ ఎత్తులో పెరుగుతాయి. వాటి ఆకులు నేలకు తాకుతూ ఉంటాయి. అయితే వర్షాలు పడేటప్పుడు నీరు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువస్తూ ఉంటుంది.
అలా వచ్చిన నీరు మొక్కల ఆకులను తాకడం వాటికి దగ్గరగా రావడం కారణంగా అవి కలుషితం అవుతూ ఉంటాయి. దీని కారణంగా సూక్ష్మజీవులు, హాని కలిగించే క్రిములు వాటి మీద చేరే అవకాశం ఉంటుంది. అసలే వర్షాకాలంలో ఆకుల మీద పురుగులు ఎక్కువగా చేరుతూ ఉంటాయి. దీని కారణంగా వీటిని తీసుకోకుండా ఉండటమే మంచిది.ఆకు కూరలు ఎక్కువగా తినే అలవాటు ఉన్న వారు వారంలో మూడు, నాలుగు సార్లు కాకుండా ఒక్కసారి మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.
Also Read
Also Read: Health News: జర్వం వచ్చినప్పుడు బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వొచ్చా?
అసలే వానాకాలంలో డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకు కూరలను తీసుకుంటే త్వరగా జీర్ణం కాకపోవచ్చు. అందుకే వర్షాకాలంలో ఆకుకూరలు కాకుండా వంకాయ, బెండకాయ లాంటి ముదురు రంగులు ఉండే కూరగాయలు తినాలి. భూమికి ఎత్తులో పెరిగే కూరగాయలు తినడానికి ప్రయత్నించాలి. వంటచేసేటప్పుడు కూరగాయలను ఉప్పు నీటిలో కొద్దిసేపు ఉంచి శుభ్రం చేసి కట్ చేసిన వెంటనే వండేస్తే మంచిది.
తాజావార్తలు
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!