Cheese: ఖరీదైన చీజ్.. దీన్ని తినే డబ్బులతో కారు కొనుక్కోవచ్చు.. స్పెషాలిటీ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabrales cheese: చీజ్ ని చాలా వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. పిజ్జా తయారీలో అయితే ఇది చాలా ముఖ్యమైనది. పిజ్జా ఆర్డర్ చేసేటప్పుడే మనకు ఎక్స్ ట్రా ఛీజ్ అనే అప్షన్ కూడా ఉంటుంది. కేవలం పిజ్జాలోనే కాకుండా సాధారణంగా ఇంట్లో చేసుకునే కొన్ని వంటకాల్లో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీని ధర ఎంత ఉంటుంది. మహా అయితే రెండు వందలో మూడు వందలో ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టే మనకు అన్ని సూపర్ మార్కెట్లలలో లభిస్తుంది. చాలా మంది దీనిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చీజ్ రేటు వింటే మాత్రం అమ్మో అంతా అనడం గ్యారెంటీ ఎందుకంటే దానిని కొనాలంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆ చీజ్ కొనే డబ్బులతో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కారు కొనుక్కుంటుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంవత్సరం శాలరీ కంటే ఎక్కువే ఉంటుంది ఆ చీజ్ ధర. ఇంతకీ దాని ధర ఎంత అనుకుంటున్నారా అక్షరాల మన భారతీయ కరెన్సీలో రూ.13.50 లక్షలు. ధర చూడగానే షాక్ అయ్యారు కదా. అయితే ఈ చీజ్ లో ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంతరేటు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Wild Dog Vs Buck: దుప్పి మెడను పట్టుకొని చంపడానికి ప్రయత్నించిన అడవి కుక్క..ఫైట్ మాములుగా లేదుగా
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
సాధారణంగా మనకి తెలిసిన చీజ్ ను పాలను ఉపయోగించి మిషన్ల ద్వారా ప్రాసెస్ చేసి చేస్తారు. అయితే ఈ చీజ్ తయారీలో ఎలాంటి మిషన్లను ఉపయోగించరు కేవలం చేతితో మాత్రమే చేస్తారు. అయితే దీని ప్రత్యేకత ఇది మాత్రమే కాదు. దీనిని తయారు చేయడానికి ఆవు, మేక, గొర్రె పాలను ఉపయోగిస్తారు. వీటిని కలిపి లాస్ పికోస్ డి యూరోపా పర్వతం గుహలో నిల్వ చేస్తారు. అలా గుహలో పెట్టడం వల్ల వాటిపై నీలిరంగు మచ్చలు, చారలు ఏర్పడతాయి. తరువాత వాటిని అక్కడి నుంచి తీసుకువెళ్లి ప్రాసెస్ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 8 నెలల సమయం పడుతుంది. దీనిని 7 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ప్రత్యేక పరిస్థితుల్లో తయారు చేస్తారు. దీనిని స్పెయిన్ లోని లాగర్ డి కొలోటో అనే రెస్టారెంట్ తయారు చేస్తుంది. దీనిని “కాబ్రెల్స్ బ్లూ చీజ్“ అని అంటారు. దీని టేస్ట్ కూడా మాములుగా చీజ్ కంటే భిన్నంగా ఉంటుంది. అయితే 2019 లో ఈ చీజ్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యింది. ఇప్పుడు మళ్లీ దాని రికార్డులను అదే బ్రేక్ చేసింది. ఇటీవల లాగర్ డి కొలోటో రెస్టారెంట్ రెండు కేజీల కాబ్రెల్స్ బ్లూ చీజ్ ను ఏకంగా 30 వేల యూరోలకు అమ్మారు. అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 27 లక్షలు. అంటే కేజీ రూ. 13.5 లక్షలు. ఇప్పుడు చెప్పండి ఈ డబ్బులతో సామాన్యుడు కారు కొనుక్కోగలడో లేడో.
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!