Site icon NTV Telugu

Andhra Pradesh: మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

Cabinet Sub Committee

Cabinet Sub Committee

Andhra Pradesh: మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. సబ్ కమిటీ సభ్యులు మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి తొలిసారిగా భేటీ అయ్యారు. ప్రస్తుతమున్న మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను మంత్రి వర్గ ఉప సంఘం అధ్యయనం చేస్తోంది.

Read Also: CM Chandrababu: అది మన దెబ్బ..! పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగాడు..

మద్యం దుకాణాలు, బార్లు, బేవరేజెస్ కంపెనీల వంటి వాటిల్లో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారుల నివేదికను మంత్రి వర్గ ఉప సంఘం పరిశీలిస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే యోచనలో కేబినెట్ సబ్ కమిటీ ఉన్నట్లు తెలిసింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత మద్యం పాలసీ ముగియనుంది. ఈ క్రమంలో మద్యం పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Exit mobile version