New Railway Lines: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అదనంగా రెండు రైల్వే లైన్లు.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద రూ.1,264 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మొత్తం 46 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే మార్గంలో వేదావతి నదిపై 762 మీటర్ల భారీ మెగా వంతెనతో పాటు 7 ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ విస్తరణ ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లో విస్తరించి ఉన్న 99 గ్రామాలలోని సుమారు 7 లక్షల మంది ప్రజలకు నేరుగా రవాణా ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా రైలు మార్గంలో రద్దీ తగ్గి, ప్రయాణాలు వేగవంతమవుతాయి. ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, ధాన్యాల రవాణా సులువై, ఏడాదికి అదనంగా 16.22 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా.. బళ్లారి కోట, శ్రీ కుమారస్వామి దేవాలయం వంటి పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గి, కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవ్వడంతో పాటు బొగ్గు ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!