ఉత్తరప్రదేశ్ లోని ఓ బస్తీలో ఉన్న ఆవాస్ వికాస్ కాలనీలో నికిత అనే ఓ 13 ఏళ్ల బాలిక నికిత తన 15 నెలల మేనల్లుడితో కలిసి ఇంట్లోని సోఫాలో ఆడుకుంటోంది. ఇక అదే సమయానికి కుటుంబ సభ్యులందరు వేరే గదుల్లో ఉన్నారు. అయితే ఆ సమయంలో ఇంటి డోర్ తీసి ఉండడంతో.. ఇంట్లోకి ఒక్కసారిగా ఒక కోతుల గుంపు జొరబడి, కిచెన్ లో ఉన్న సామాన్లను చిందరవందర చేసింది. ఇక ఆ కోతుల గుంపులోని కొన్ని కోతులు నికిత కూర్చున్న సోఫా వైపు రాసాగాయి. ఆ దెబ్బకి నికిత తీవ్ర భయాందోళనలకు గురైంది. కాకపోతే ఆమెకు అదృష్టం కొద్దీ ఇంట్లోని ఫ్రిజ్ పై ఉన్న ఆమెజాన్ అలెక్సా డివైజ్ కనిపించింది.
Also read: CSK: ఎస్ఆర్హెచ్పై ఓటమి.. కారణమేంటో చెప్పిన కెప్టెన్
ఇంకేముంది., నికిత వెంటనే తెలివిగా ఆలోచించి .. అలెక్సా కు వాయిస్ కమాండ్ ఇచ్చింది. ‘‘అలెక్సా కుక్కలా గట్టిగా మొరుగు’’ అని అలెక్సా కు నికిత వాయిస్ ఆర్డర్ ఇచ్చింది. దానితో వెంటనే వాయిస్ విన్న వెంటనే అలెక్సా డివైజ్ తన పని మొదలు పెట్టింది. దాంతో అలెక్సా నుండి గట్టిగా కుక్క అరుపులు వినిపించడం మొదలైంది. ఇందుకేముంది ఆ వాయిస్ కు భయపడిన ఆ కోతులు వెంటనే అక్కడి నుంచి పారిపోయాయి. అలెక్సా సాయంతో కోతుల దాడి నుంచి బయటపడిన నికితను అంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ, కాస్త కూడా భయపడకుండా, మంచి సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరితో అభినందనలు పొందించి.
తన సమయస్ఫూర్తితో, తెలివితో కేవలం తన ప్రాణాలు మాత్రమే కాకుండా.. తన మేనల్లుడి ప్రాణాలు కూడా కాపాడిందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ సంఘటనపై నికిత మాట్లాడుతూ.. ‘‘కొంతమంది అతిథులు మా ఇంటికి వచ్చి వెళ్తున్న సమయంలో గేటును తెరిచే ఉంచారని., దాంతో, కొన్ని కోతులు వంటగదిలోకి ప్రవేశించి వస్తువులను చిందరవందర చేయడం ప్రారంభించాయి. ఆ సమయలో పిల్లవాడు భయపడ్డాడని.. అంతేకాకుండా నాకు కూడా భయమేసిందని., కాకపోతే అప్పుడు నేను ఫ్రిజ్ పై ఉన్న అలెక్సాను చూశి.. వెంటనే కుక్క శబ్దాన్ని ప్లే చేయమని అలెక్సాను అడిగినట్లు చెప్పింది. ఆ అరుపు శబ్దంతో ఇంట్లోకి వచ్చిన కోతులు భయపడి పారిపోయాయి’’ అని నికిత పరిస్థితిని వెల్లడించింది.
