Miss You : గతేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్.. ‘ఇండియన్ 2’తో ప్రేక్షకుల ముందు వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నాడు. తాజాగా సిద్దార్థ్ తన కొత్త సినిమా మిస్ యూ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫర్వా లేదని అనిపించుకుంది. ఎన్ రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. చాల రోజుల తర్వాత సిద్దార్థ్ ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. లవర్ బాయ్ పాత్రను పోషించాడు. 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శామ్యూల్ మాథ్యూ మిస్ యూ సినిమాను నిర్మించాడు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
Read Also:CM Chandrababu : మద్యం దుకాణదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త
ఈ సినిమాను డిసెంబర్ 13న మంచి బజ్‌తో థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మిస్ యు’ చిత్రం జనవరి 26 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కి వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుంది.
Read Also:Kadapa: కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం.. ఇద్దరు మృతి