NTV Telugu Site icon

Buttermilk Benefits : మజ్జిగతో జుట్టు, చర్మానికి కూడా ఉపయోగాలు

Buttermilk 10

Buttermilk 10

వేసవిలో చల్లదనం కోసం మజ్జిగ తాగుతుంటాం. వేడి వాతావరణంలో దాహం, అలసట పోవాలంటే మజ్జిగ తాగడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. మజ్జిగ శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది. ఇంత వరకే మనకు తెలుసు కాని.. మజ్జిగ తాగడం వల్ల జుట్టు, చర్మానికి కూడా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా పెగాలంటే మజ్జిగలో ఏమేం కలపాలో తెలుసుకుందాం.. మజ్జిగలో హైడ్రేషన్, పోషకాలు ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు, చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది జుట్టు, చర్మంలో తేమను కోల్పోకుండా చేస్తుంది. జుట్టు మెరుస్తూ, చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

READ MORE: Namburu Sankar Rao: రాబోయే ఎన్నికల్లో 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తా..

మజ్జిగా ఎప్పుడు తయారు చేసుకునేలా కాకుండా.. ఇలా ప్రయత్నించండి. మజ్జిగ సిద్ధం చేసేటప్పుడు కరివేపాకులను జోడించాలి. ఎందుకంటే కరివేపాకు పోషకాల భాండాగారం. కరివేపాకులో బీటా కెరోటిన్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కరివేపాకు, మజ్జిగలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఆక్సీకరణ నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతుంది. మజ్జిగ, అల్లంలోని శీతలీకరణ గుణాలు చర్మపు చికాకు, దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి, వడదెబ్బ, ఇతర చర్మపు చికాకులు ఉన్నవారికి మజ్జిగ సమర్థవంతమైన చర్మ సంరక్షణకు ఇది ఉపయోగకరం. దురదను సైతం తగ్గిస్తుంది. పూర్వం ప్రజలు భోజనం తర్వాత మజ్జిగ తాగేవారు. నేటికీ కూడా కొంతమంది భోజనం తర్వాత తాగుతారు. ఎందుకంటే జీర్ణక్రియను సులభతరం చేయడానికి మజ్జిగ మంచిది.. కప్పు మజ్జిగలో గుప్పెడు కరివేపాకు, రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఐదారు చెర్రీలు వేసి బాగా కలపాలి. కొన్ని కరివేపాకు వేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు వేస్తే మజ్జిగ రెడీ. పైన చెప్పిన పదార్థాలను కలిపి మజ్జిగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నిఫుణులు చెబుతున్నారు. ఎప్పుడూ చేసుకునే లాగా కాకుండా ఈ సారి మజ్జిగ తయారు చేసేటప్పుడు పైన చెప్పిన కొన్నింటిని కలపండి.