NTV Telugu Site icon

Butter and Ghee Adulteration: వెన్న, నెయ్యి కల్తీ రాకెట్ ముఠాను ఛేదించిన అధికారులు..

Ghee

Ghee

ముంబై నగరంలోని పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ లో ఉన్న ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వెన్న, నెయ్యి కల్తీ రాకెట్‌ను కనుగొన్నారు. ఈ దాడులలో రూ. 1.2 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. దక్షిణ ముంబై లోని ఎల్‌టి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరా బజార్‌ లోని నానాభాయ్ బిల్డింగ్‌ లోని ఒక దుకాణంపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిందితులు ప్రముఖ నెయ్యి బ్రాండ్లను కల్తీ చేస్తున్నట్టు గుర్తించారు.

Manipur: మణిపూర్ సీఎం నివాసం దగ్గర భారీ అగ్నిప్రమాదం

ఇక అధికారుల నివేదికల ప్రకారం.. జోగేశ్వరిలో నివాసం ఉంటున్న చమన్ షాము యాదవ్ (40), ఝమన్ షాము యాదవ్ (55) ఇద్దరినీ పామాయిల్, వనస్పతి, బటర్ కలర్, ఫ్లేవర్ ఏజెంట్లను కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరితోపాటు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు కూడా దాడిలో సహాయం చేయడానికి సంఘటనా స్థలంలో ఉన్నారు. ఈ బృందం సైట్ నుండి పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి, సంబంధిత పదార్థాలను స్వాధీనం చేసుకుంది. 780 లీటర్ల నకిలీ నెయ్యితో పాటు టాప్ బ్రాండ్లుగా ముద్రించిన 425 బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో స్టీల్ ట్యాంక్, గరాటు, ప్లాస్టిక్ మగ్, కెటిల్, ఫ్లేవర్ బాక్స్, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, ప్యాకింగ్ మెషిన్, అమూల్ స్వచ్ఛమైన నెయ్యి ఖాళీ ప్యాకెట్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న సామాగ్రి మొత్తం విలువ ఒక లక్ష ఇరవై వేల పైగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు.

UPSC Prelims 2024: ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్నారా.. వీటిని గుర్తుంచుకోండి..

ఈ సందర్భంగా అధికారులు సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ఐపిసి, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఎల్‌టి మార్గ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఇక అక్కడ తదుపరి విచారణ కొనసాగుతోంది.