చాలా మంది చిన్న వయసులోనే డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన వాళ్లను మనం చూసి ఉంటాం. చిన్న వయసులోనే భారీ ప్యాకేజీతో మల్టీ నేషనల్ కంపెనీలోనో ఉద్యోగం తెచ్చుకున్న వారిని చూసి ఉంటాం. కానీ ఈ కుర్రాడు మాత్రం 17 ఏళ్లకే వ్యాపారాన్ని స్టార్ట్ చేసి.. దాని కోసం స్కూలు చదువును కూడా పక్కన పెట్టాడు. చదువులు తన వల్ల కాదని ఎంటర్ ప్రెన్యూర్‌గా మారాడు. కోట్లలో సంపాదిస్తూ 19 ఏళ్లకే బాగా సెటిల్ అయ్యాడు. ఇక 22 ఏళ్లు వచ్చేసరికి తనకు కావాల్సిన డబ్బును సంపాదించుకున్నాడు. దీంతో 22 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ తీసుకున్నాడు.
Read Also: Hyderabad Crime: హైదరాబాద్ లో డబుల్ మర్డర్.. ఇద్దరు ట్రాన్స్ జెండర్ల హత్య
అమెరికాకు చెందిన హెడెన్ బౌల్స్.. 10, 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇష్టమైంది ఏదైనా కొనుగోలు చేసుకునేందుకు డబ్బు ఉండేది కాదని.. తల్లిదండ్రులను అడిగినా వాటిని కొనిచ్చే స్తోమత లేదని చెప్పాడు. దీంతో అప్పుడే తనకు సొంత సంపాదన అవసరమనిపించిందని ఆయన పేర్కొన్నాడు. అప్పుడు ఎవరినీ డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండానే ఇష్టం ఉన్న వస్తువులు కొనుక్కోవచ్చని నిర్ణయించుకున్నట్లు హెడెన్ బౌల్స్ తెలిపాడు. దీని కోసం 17 ఏళ్ల వయసులోనే స్కూలు చదువు మానేసి.. వ్యాపారంలోకి దిగినట్లు చెప్పాడు.
Read Also: Jennifer Mistry: ఆ నిర్మాత లైంగికంగా వేధించాడు, ఆధారాలున్నాయి.. పోలీసు కేసు నమోదు
17 ఏళ్ల వయసు రాగానే హెడెన్ బౌల్స్.. ఈ కామ్ సీజన్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ కామ్ సీజన్‌లో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తూ ఉంటాడు. ఇందులో ఫీజును 575 డాలర్లుగా ఫిక్స్ చేశాడు. ఈ కామ్ సీజన్‌లో భారీగా లాభాలు రావడంతో 18 ఏళ్ల వయసులోనే సొంతంగా అత్యంత విలువైన లంబోర్గినీ కారును కొనుకున్నాడు. 19 ఏళ్ల వయసులోనే కోట్లు సంపాదించుకున్నాడు. 2022 నాటికి హెడెన్ బౌల్స్ ఆదాయం 15 మిలియన్ డాలర్లు అంటే దాదాపు మన కరెన్సీలో రూ. 123 కోట్లు అన్నమాట.
Read Also: Ashika Ranganath: రాకీ భాయ్ ప్రాపర్ హస్బెండ్ మెటీరియల్…
ఈ 15 మిలియన్ డాలర్లలో 3 మిలియన్ డాలర్లు అంటే రూ.25 కోట్ల లాభం ఉన్నట్లు అతడు తెలిపాడు. ఈ కామ్ సీజన్.. బాగా ప్రాచుర్యం పొందటంతో హెడెన్ బౌల్స్ ఆదాయం బాగా పెరిగింది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ హెడెన్ బౌల్స్ పెట్టుబడులు పెట్టాడు. అందులో నుంచి వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని దాచి ఉంచాడు. దాని నుంచి వచ్చే ఆదాయంతో తన ఖర్చులు తీర్చుకుంటున్నట్లు బౌల్స్ వెల్లడించాడు.