NTV Telugu Site icon

Bus Stop: ఇదేందయ్యా ఇదీ.. రాత్రికి రాత్రే బస్టాండ్‌ను ఎత్తుకెళ్లారు!

Bus Stop

Bus Stop

Bus Stop Shelter Stolen: చోరీకి కాదేది అనర్హం అన్న తీరుగా దేశంలో పరిస్థితి తయారైంది. ఎక్కడ చూసినా దొంగలు అవాక్కయేలా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. దొంగలు ఏకంగా బస్టాండ్‌ను ఎత్తుకెళ్లారు. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. కర్ణాటక రాజధాని బెంగళూరులో బస్టాండ్‌నే దొంగతనం చేసిన ఈ వింతకేసు తాజాగా వెలులగులోకి వచ్చింది. బస్టాండ్‌లో జరిగిన చోరీ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి ప్రకటన కూడా వెలువడింది.

Also Read: Costly wedding Dress : ప్రపంచంలోనే ఖరీదైన వెడ్డింగ్ డ్రెస్స్.. ధర తెలిస్తే ఫ్యూజులు అవుటే..

బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్‌లో మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ కొత్తగా బస్టాండ్‌ను నిర్మించింది. దాదాపు 10 లక్షల రూపాయల విలువైన సామాగ్రితో స్పెయిన్ లెస్ స్టీల్‌తో, అధునాతన వసతులతో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్టాండ్‌ను నిర్మించింది. అయితే బస్సు షెల్టర్ నిర్మించిన వారం రోజుల్లోనే దొంగలు దానిని మాయం చేశారు. రాత్రికి రాత్రే అదను చూసి బస్టాండ్‌ను విడివిడి భాగాలుగా విడగొట్టి ఎత్తుకెళ్లారు. బస్టాండ్‌ను ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే ఈ చోరీ జరగడంతో స్థానికులు షాక్‌ అయ్యారు. బస్సు సెంటర్‌ నిర్మాణానికి బాధ్యత వహించే బెంగళూ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ బస్టాండ్‌ అదృశ్యమైన నెల రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులెవరిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు.

Also Read: Supreme Court: రాష్ట్ర విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేం.. బీహార్‌ ప్రభుత్వానికి నోటీసులు

ఈ చోరీ కేసు వెలుగులోకి రావడంతో కర్ణాటక రవాణా మంత్రి స్పందించారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) ఎలాంటి బస్టాప్‌లను నిర్మించడం లేదని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. ఇప్పుడు బృహత్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) నిర్మాణాన్ని చేపడుతుందని చెప్పారు. కమీషనర్ తో మాట్లాడి అక్కడ కొత్త బస్టాప్ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. బస్టాండ్‌లనే టార్గెట్‌ చేసుకుని చోరీకి పాల్పడుతున్న దొంగలను పట్టుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.