Site icon NTV Telugu

Rishabh Pant: రిషబ్‌ పంత్‌ను రక్షించిన వారిని సన్మానించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

Cricketer Rishabh Pant

Cricketer Rishabh Pant

Rishabh Pant: ఇటీవల ప్రమాదానికి గురైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్, ఆపరేటర్‌ను తమ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. “జనవరి 26న క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్, ఆపరేటర్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం గౌరవిస్తుంది” అని ధామి అన్నారు. రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడటానికి డ్రైవర్, ఆపరేటర్ తమ ప్రాణాలను పణంగా పెట్టారని ముఖ్యమంత్రి అన్నారు. క్రికెటర్ కారు వారి కళ్ల ముందు రెండుసార్లు బోల్తా పడింది. అత్యవసర పరిస్థితిని పరిష్కరించడంలో హర్యానా రోడ్‌వేస్ సిబ్బంది తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. రిషబ్ పంత్ ఉత్తరాఖండ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

డిసెంబరు 30న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో, పంత్ శుక్రవారం రూర్కీలోని నర్సన్ సరిహద్దులో డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తన తల్లిని సర్‌ప్రైజ్ చేసేందుకు ఢిల్లీ నుంచి రూర్కీకి తిరిగి వస్తుండగా తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో పంత్ కారులో ఒక్కడే డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రమాదంలో పంత్ వీపు, నుదురు, కాలుపై గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అయింది. పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చినట్లు హరిద్వార్ ఎస్పీ (రూరల్) స్వపన్ కిషోర్ శుక్రవారం తెలిపారు. రిషబ్ పంత్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ఢిల్లీ క్రికెట్ బోర్టు డైరెక్టర్ వెల్లడించారు. అవసరమైతే అతడిని ఢిల్లీకి తరలించవచ్చని తెలిపారు.

Harrasment: లైంగిక ఆరోపణల నేపథ్యంలో హర్యానా క్రీడా శాఖ మంత్రి రాజీనామా

బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్ గురుకుల్ కారు డివైడర్‌ను ఢీకొట్టడాన్ని గుర్తించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కారులో పంత్‌కు సహాయం చేయడానికి వారు కారు వైపు పరుగులు తీశారని పానిపట్ బస్ డిపో జనరల్ మేనేజర్ కె.జాంగ్రా అన్నారు. హర్యానా ప్రభుత్వం డిసెంబర్ 30న వారు ప్రాణాలకు తెగించి రిషబ్ పంత్‌ను కాపాడినందుకు వారిని సత్కరించింది. తాము రిషబ్ పంత్‌ను కారులో నుంచి లాగినప్పుడు మంటలు వ్యాపించాయని.. 5-7 సెకన్లలో వాహనం కాలిపోయిందని రిషబ్ పంత్‌ను రక్షించిన బస్సు సిబ్బంది పరంజీత్ అన్నారు.

Exit mobile version