Bus Accident : మొబైల్ టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ టిఫిన్ సెంటర్‌లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన జనగాం జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రఘునాథ్ పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రోడ్డు పక్కనే ఓ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు మరొకరు మృతి చెందినట్లు సమాచారం. వీరేకాకుండా.. టిఫిన్ సెంటర్‌లో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి టిఫిన్ సెంటర్‌లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో.. భయంకర దృశ్యాలు ప్రమాదం జరిగిన తీరుకు కనబరుస్తున్నాయి. కాగా, ఈ రోడ్డు ప్రమాదం కారణంగా ఆర్టీసీ బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. దీంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?