Site icon NTV Telugu

Boora Narsaiah Goud : ముఖ్యమంత్రి స్పీచ్‌లో పసలేదు.. బీఆర్‌ఎస్‌కు బస లేదు

Boora Narsaiah

Boora Narsaiah

ముఖ్యమంత్రి స్పీచ్‌లో పసలేదు.. బీఆర్ఎస్‌కు బస లేదు అని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు బుర్ర నర్సయ్య గౌడ్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తాజాగా ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాట్లాడుతూ.. అవినీతికి పరాకాష్టగా కేసీఆర్‌ ప్రభుత్వమన్నారు. ఖమ్మం సభ ఖర్చు 300కోట్లు, ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడికి కట్టబెట్టిన భూమి కమిషన్ తో పెట్టిన సభ అది అని ఆయన వ్యాఖ్యానించారు. కార్లమార్స్ సిద్ధాంతం సైతం అమ్ముకున్న కమ్యూనిస్ట్ నాయకులు అని ఆయన ఆరోపించారు. 9 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో చేసింది ఏముందని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు బర్గర్లకు పొంతన ఏముందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించడం ప్రజలకు ఇచ్చిన వాగ్దాలను కప్పిపుచ్చుకునేందుకే పార్టీ ఏర్పాటు చేశాడన్నారు. కమ్యూనిస్టులు దిగజారి బీఆర్‌ఎస్‌తో పొత్తు కేవలం స్వలాభం కోసమేనని ఆయన విమర్శించారు.

Also Read : Amazon: యాపిల్‌ను దాటేసిన అమెజాన్..అత్యంత విలువైన కంపెనీగా

ఎన్నికల కోసమే కంటి వెలుగు అనేది 200 కోట్ల పెట్టడం ఈ పథకంలో ఏముందన్నారు. కంటి వెలుగు కేంద్రంలో ఏ ఒక్క కంటి డాక్టర్ లేడని ఆయన అన్నారు. సరోజిని దేవి ఆసుపత్రిలో సంవత్సరానికి కేవలం 9000 వేల ఆపరేషన్ లు చేస్తున్నారని, గతంలో నాలుగు ఆసుపత్రిలను ఏర్పాటు చేయాలని కోరడంతో పార్టీ నుండి నన్ను వెల్లగొట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించి, కంటికి సంబంధించి విభాగం ఏర్పాటు చేయాలన్నారు. ఇబ్రహీంపట్నం ఆవేదన… నివేదికతో త్వరలో ప్రజల ముందుకు వాస్తమని, దళితల మీద వివక్షత చూపుతున్న ముఖ్యమంత్రి.. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ను దాదాపు మూడు సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగిందన్నారు.

Exit mobile version