NTV Telugu Site icon

Xiaomi 14 : బంపర్ ఆఫర్.. అమెజాన్ లో రూ. 20 వేల తగ్గింపు..

Xiomi 14

Xiomi 14

Xiaomi 14 : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. Xiaomi 14 పై ఆకర్షణీయమైన ఆఫర్ నడుస్తోంది. దింతో మీరు ఈ ఫోన్‌ ను ఆకర్షణీయమైన ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో Xiaomi 14 అల్ట్రాతో ఈ స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. రూ. 79,999 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే, మీరు ఈ ఫోన్‌ను అమెజాన్‌లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై కొన్ని వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. వినియోగదారులు బ్యాంకు ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ పై ఉన్న ఆఫర్ల వివరాలను తెలుసుకుందాం.

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చనే మొదటి హీరో: అశ్వినీ దత్

మీరు Xiaomi 14 ని 12GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ హ్యాండ్‌ సెట్‌ ను రూ.79,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఈ ప్లాట్‌ఫారమ్‌ లో 13% తగ్గింపు తర్వాత రూ. 69,999 వద్ద జాబితా చేయబడింది. అలాగే SBI లేదా ICICI బ్యాంక్ కార్డ్ ఉపయోగించి ఫోన్‌పై రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 33 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్లన్నింటి తర్వాత ఈ ఫోన్ మంచి డీల్ అవుతుంది. దింతో ఈ ఫోన్ పై ఏకంగా 20 వేల భారీ డిస్కౌంట్ ను పొందవచ్చు అనమాట.

Air India: టీమిండియాను ఇంటికి తీసుకురావడానికి అమెరికా విమానం రద్దు.. నివేదిక కోరిన డీజీసీఏ..

Xiaomi 14 6.36 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో వస్తుంది. ఇది HDR 10+కి మద్దతునిస్తుంది. స్క్రీన్‌ ను రక్షించడానికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉపయోగించబడింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్‌ లో హ్యాండ్‌సెట్ పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ తో వస్తుంది. ఇది 50MP + 50MP + 50MP ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో, కంపెనీ 32MP సెల్ఫీ కెమెరాను అందించింది. పరికరానికి శక్తినివ్వడానికి 4610mAh బ్యాటరీ అందించబడింది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Show comments