Site icon NTV Telugu

Tata EV Discount 2025: టాటా ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 1.5 లక్షల డిస్కౌంట్

Tata

Tata

సొంత కారు ఉండాలని కోరుకుంటున్నారా? కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కారు లవర్స్ కు బంపరాఫర్ ప్రకటించింది. టాటా మోటార్స్ ఏప్రిల్ 2025 నెలలో తన ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద కంపెనీ రూ.1.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌లో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ ఉన్నాయి.

Also Read:Xiaomi QLED TV X Pro Series: గేమింగ్ మోడ్ ఫీచర్ తో షియోమీ కొత్త స్మార్ట్ టీవీ వచ్చేస్తోంది..

టాటా నెక్సాన్ EV

టాటా నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ SUV. దీనిపై కంపెనీ రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్‌లో MY24, MY25 మోడల్‌లు ఉన్నాయి. దీని MY24 మోడల్‌కు రూ. 40,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 30,000 స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. దీనిపై టాటా EV కస్టమర్లకు రూ. 50,000, ICE కస్టమర్లకు రూ. 20,000 లాయల్టీ బోనస్ ప్రకటించింది. దాని MY25 మోడల్‌పై రూ. 30,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఇస్తోంది.

Also Read:IndiGo: చిన్నారి బంగారు గొలుసు దొంగతనం.. “ఇండిగో” మహిళా సిబ్బందిపై ఆరోపణ..

టాటా పంచ్ EV

ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ. 70,000 వరకు తగ్గింపు అందిస్తోంది. దీని MY24 మోడల్ పై రూ. 20,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ లభిస్తోంది. దీని MY25 మోడల్‌కు రూ. 40,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 10,000 అదనపు స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తోంది.

Also Read:Betting : కోడ్ వర్డ్స్, సీక్రెట్ గ్రూప్స్.. బెట్టింగ్ మాఫియా కొత్త ప్లాన్

టాటా టియాగో EV

దీనిపై రూ.1.30 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు. దీని MY24 మోడల్‌కు రూ. 85,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 15,000 అదనపు కన్స్యూమర్ బోనస్, రూ. 30,000 స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వబడుతున్నాయి. దీని MY25 మోడల్ రూ. 40,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 10,000 స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌ను లభిస్తోంది.

Also Read:Meesala Ramudu : సాక్షాత్తు శ్రీరాముడు స్వయంభూగా వెలసిన ఆలయం.. దేశంలో ఎక్కడలేని విధంగా మీసాలతో శ్రీరాముని విగ్రహం

టాటా కర్వ్ EV

ఇది టాటా మోటార్స్ నుంచి వచ్చిన కొత్త, స్టైలిష్ ఎలక్ట్రిక్ కారు. 2025 ఏప్రిల్‌లో దీనిపై రూ. 1.50 లక్షల తగ్గింపును అందిస్తున్నారు. దీని MY24 మోడల్‌పై రూ. 70,000 (అన్ని వేరియంట్‌లపై) కన్స్యూమర్ ఆఫర్, రూ. 30,000 స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 వరకు లాయల్టీ బోనస్ అందిస్తోంది. దాని MY25 మోడల్‌పై కేవలం రూ. 30,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ మాత్రమే ప్రకటించింది.

Exit mobile version