NTV Telugu Site icon

Budget 2024: బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మొబైల్ ఫోన్ల ధరలపై..!

Cell Phones

Cell Phones

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు మోడీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. సెల్ ఫోన్స్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, ఇతర మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5 శాతం తగ్గించనున్నట్లు తెలిపింది. మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్‌ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్‌ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్‌లపై కూడా దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Read Also: Jyothi Rai : జ్యోతి రాయ్ వయసు ఎంతో తెలుసా?.. ఇంత చిన్నదా?

మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ నిర్ణయంతో భారతదేశంలో ఫోన్‌లను ఉత్పత్తి చేసే కంపెనీలకు మరింత ఊరట లభిస్తుంది. దిగుమతి సుంకం తగ్గించడంతో మొబైల్‌ ఫోన్ల ధరలు సైతం తగ్గే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదికలో స్మార్ట్‌ ఫోన్‌ల తయారీకి ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చని తెలిపింది. ప్రభుత్వ చర్య మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు.