పొత్తులు, టిక్కెట్ కేటాయింపు విషయంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆసక్తికర కామెంట్లు చేశారు. అనకాపల్లి పార్లమెంట్ లేదా విజయవాడ పశ్చిమలో రెండిట్లో ఓ సీటు తనకు ఇస్తారని.. తాను పోటీ చేస్తానని తెలిపారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తానని చెప్పారు. నా నాలుక కోసుకుంటాను కానీ.. చంద్రబాబుని ఎప్పుడు విమర్శించనన్నారు. చంద్రబాబును అలా విమర్శించాల్సిన రోజే వస్తే రాజకీయాల నుంచి తప్పుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోతానని పేర్కొన్నారు. మరోవైపు.. టీడీపీలో ఎవరైనా టిక్కెట్టు రాలేదని చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కాగా.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి తనను పక్కనపెట్టే ఆలోచన చంద్రబాబుకు లేదని చెప్పారు. పొత్తులు ఓకే అయినా.. సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదని అన్నారు.
Read Also: Vidadala Rajini: గుంటూరులో డయేరియా కలకలం.. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి
మరోవైపు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం లభిస్తే.. దేశంలో ఉన్న అన్నీ రాజకీయ పార్టీల అధినేతలు శుభాకాంక్షలు చెబితే.. జగన్ స్పందించలేదని బుద్ధా వెంకన్న విమర్శించారు. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలంటూ తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించలేదని విమర్శించారు.
Read Also: Palakurthy Thikkareddy: అందరికీ అండగా ఉండాలనే లోకేష్ శంఖారావం పూరించబోతున్నారు..