Site icon NTV Telugu

Buddha Venkanna: పొత్తుతో సీటు కోల్పోయిన వాళ్ల ఆందోళన సరికాదు.. పదవులు లేకపోతే బతకలేమా..?

Buddha Venkanna

Buddha Venkanna

Buddha Venkanna: టీడీపీలో టిక్కెట్ దక్కని వాళ్లు చేస్తున్న ఆందోళనపై బుద్దా వెంకన్న మండిపడ్డారు.. చంద్రబాబుకు, పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్లు చేస్తే ఊరుకోనని ముందే చెప్పిన ఆయన.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. పొత్తు వల్ల సీటు కోల్పోయిన వాళ్ల ఆందోళన సరికాదని హితవుపలికారు.. పదవులు లేకపోతే బతకలేమా? అని ప్రశ్నించారు. ఇండిపెండెంటుగా పోటీ చేస్తా అంటూ బెదిరింపులు సరికాదన్న ఆయన.. కార్యకర్తలు.. పార్టీ కోసం, చంద్రబాబు కోసం పని చేస్తారు.. నేతల కోసం కార్యకర్తలు పని చేయరని స్పష్టం చేశారు.

Read Also: Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ కు ఏడాది పూర్తి.. నేడు ఆదిలాబాద్ కు భట్టి విక్రమార్క..!

ఇక, రాష్ట్రంలో నాకన్నా ఫైటర్ ఎవరున్నారు..? అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న.. ఐవీఆర్ఎస్ పెడితే ఫస్ట్ ప్లేస్ నాకే వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకున్నాడు. నాని వెనుక పది మంది కూడా లేరన్నారు.. క్యాష్ కోసం క్యారెక్టర్ అమ్ముకున్న వ్యక్తి కేశినేని నాని అంటూ విమర్శించారు. బెజవాడ ఎంపీ స్థానాన్ని లక్ష ఓట్లతో టీడీపీ గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. టిక్కెట్ ఇప్పిస్తానని‌ చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర కేశినేని నానిది అంటూ ఆరోపించారు.. ఇక, కేశినేని నాని ఓటమి ఖాయం.. నానికి భవిష్యత్తు శూన్యం అంటూ జోస్యం చెప్పారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న.. కాగా, పొత్తులో భాగంగా కొన్ని సీట్లను జనసేన, బీజేపీకి టీడీపీ నేతలు త్యాగం చేయాల్సిన పరిస్థితి రాగా.. టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతోన్న విషయం విదితమే.

Exit mobile version