Budda Rajasekhar Reddy: రెండు రోజుల క్రితం శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై జరిగిన ఘటనపై ఇటు ప్రతిపక్ష పార్టీలో, అటు సొంత పార్టీలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. వైస్సార్సీపీ నాయకులు అబంటీ రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిపై శ్రీశైలం నియోజకవర్గం ఆయన సెటైర్లు వేశారు. శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ లో మద్యం సేవించి అటవీ శాఖ సిబ్బంది పై దాడి చేశానని వైస్సార్సీపీ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణిరెడ్డి నోటికి వచ్చినట్లు వాగుతున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మండిపడ్డారు.
Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు.. జర్నలిస్టులు సహా 15 మంది మృతి
తాను గెస్ట్ హౌస్ లో కూర్చొని మద్యం సేవిస్తుంటే శిల్పా, అంబటి ఇద్దరూ దగ్గర వుండి గ్లాస్ లో మందు, షోడా పోసి కలిపారా అంటూ సెటైర్ వేశారు. మద్యం సేవించి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేశానని నిరూపిస్తే బహిరంగంగా మోకాళ్లపై కూర్చొని క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ఎమ్మెల్యే బుడ్డా అన్నారు. నిజాలను తెలుసుకోకుండా అవాస్తవాలను చూపించి మీడియా మర్యాదనే దిగజార్చారని ఆయన మండిపడ్డారు. బుడ్డా అంటే ఇప్పటివరకు శ్రీశైలం నియోజకవర్గం వరకే తెలుసు.. శ్రీశైల శిఖర సంఘటనతో అంతర్జాతీయంగా ఎక్కడలేని గుర్తింపును తీసుకువచ్చిన తప్పుడు మీడియాకు కోట్లాది కృతజ్ఞతలు అని అన్నారు. అటవీ సిబ్బందిపై నేను దాడి చేశానని తప్పుడు ఆరోపణలు చేసిన శిల్ప చక్రపాణి రెడ్డి, అంబటి రాంబాబు లపై పరువు నష్ట దావా వేస్తానని ఎమ్మెల్యే బుడ్డా తెలిపారు.
Pawankalyan : OG లో.. పవన్ కళ్యాణ్ చేతిపై టాటూ అర్థం ఏంటో తెలుసా?
