Uttar Pradesh: బదౌన్‌లో స్కూల్ వ్యాన్‌ని ఢీకొన్న బస్సు, డ్రైవర్‌తో పాటు నలుగురు చిన్నారులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో స్కూల్ బస్సు, వ్యాన్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పాఠశాల విద్యార్థులు, ఓ డ్రైవర్ మృతి చెందారు. డజను మందికి పైగా చిన్నారులు కూడా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ప్రమాద వార్త తెలియగానే చనిపోయిన చిన్నారుల ఇంట్లో విషాదం నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉన్న పిల్లలను మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ కుమార్తె కూడా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె స్కూల్ వ్యాన్‌లోనే ఉంది.
Read Also:IND vs ENG: ఇంగ్లండ్‌పై విజయం.. వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు!
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
రెండు వాహనాలు (బస్సు, వ్యాన్) పాఠశాలకు వెళ్లేవి. వారి డ్రైవర్లు వారి వారి ప్రాంతాల నుండి పిల్లలను మయూన్ పట్టణంలోని SRPS ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు తీసుకువెళుతున్నారు. ఉసావా పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూన్-నబీగంజ్ రహదారిపై రెండు పాఠశాల వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో వ్యాన్ డ్రైవర్, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు, డ్రైవర్‌తో సహా మొత్తం 5 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత బాధిత కుటుంబాల్లో గందరగోళం నెలకొంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న డీఎం మనోజ్ కుమార్ సహా ఉన్నతాధికారులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎం ఆస్పత్రి పాలకవర్గాన్ని ఆదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థులను వైద్య కళాశాలకు తరలించారు. రెండు వాహనాలు అతివేగంతో రావడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయని చెబుతున్నారు.
Read Also:Viral : ‘అభి తో పార్టీ షురు హుయ్ హై’.. యువకులపై మీద పడిన డీజే
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..