NTV Telugu Site icon

BSNL: ఇక పది రోజులే ఆఫర్.. కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ

Bsnl

Bsnl

BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ చాలా మంది వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, దీన్ని పాన్-ఇండియా లెవెల్‌లో అందుబాటులో ఉంచడంతో ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ ఒక ఏడాదిపాటు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ టారిఫ్‌లను పెంచినప్పటికీ BSNL ధరలను పెంచలేదు. కాబట్టి, ఈ ప్లాన్ ధర ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.

Read Also: Electronics Premier League: ఐపీఎల్ 2025 కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేక డీల్స్!

ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, మొత్తం 24GB డేటా లభిస్తాయి. అయితే, ఈ ప్లాన్ డేటా ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన వారి కోసం కాకుండా ఎక్కువ కాలం సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారి కోసం రూపొందించబడింది. లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అన్ని కాల్స్‌ 365 రోజులు వాడుకోవచ్చు. 24GB డేటా ఈ డేటా పూర్తయిన తర్వాత అదనంగా డేటా వోచర్లను రీఛార్జ్ చేసుకోవాలి. వ్యాలిడిటీ ఒకసారి రీఛార్జ్ చేస్తే మొత్తం ఏడాది పాటు ఉపయోగించుకోవచ్చు. అదనపు గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాల విషయానికి వస్తే ఇందులో Hardy Games, Challenger Arena Games, Gameson, Gameium, Lystn Podcast, Zing Music, BSNL Tunes వంటి సేవలు ఉచితంగా లభిస్తాయి.

Read Also: Warm Water: వేసవిలో చల్లటి నీటి కంటే వేడి నీరు తాగితే మంచిది.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..?

ఈ BSNL 1499 ప్లాన్ రోజూ ఎక్కువ డేటా అవసరమైన వినియోగదారులకు సరిపోదు. కేవలం, సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి.. కాలింగ్ ముఖ్యమైన వారికి, ఇంకా ఎక్కువ డేటా అవసరం లేని వారికి ఈ ప్లాన్ బెస్ట్.