BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
- BSNL రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ అందుబాటులోకి..
- ఈ ప్లాన్‌ను కొత్తగా BSNL సిమ్ తీసుకునే కస్టమర్లు మాత్రమే
- రూ.1 ప్లాన్‌ను FRC (First Recharge Coupon)గా మాత్రమే అందుబాటులో.. 24 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ..
- ప్రతిరోజూ 1GB డేటా చొప్పున మొత్తం 24GB డేటా..
- అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం అందుబాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (బీఎస్ఎన్ఎల్) మొబైల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గతంలో అందుబాటులో ఉండి కొంతకాలం తర్వాత తొలగించిన రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్లాన్ అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ప్లాన్‌ను కేవలం కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకునే కస్టమర్లు మాత్రమే వినియోగించుకోవచ్చు.
BSNL రూ.1 ప్లాన్‌ను FRC (ఫస్ట్ రీఛార్జి కూపన్)గా మాత్రమే అందిస్తోంది. కొత్తగా BSNL సిమ్ తీసుకున్నప్పుడు చేసే మొదటి రీఛార్జ్గానే ఈ ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఇప్పటికే సిమ్ ఉపయోగిస్తున్న పాత కస్టమర్లు లేదా ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న నంబర్లకు ఈ ప్లాన్ వర్తించదు. ఈ రూ.1 ప్లాన్ గతంలో కూడా అందుబాటులో ఉంది. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్రయోజనాల్లో కొంత మార్పు చేశారు. గతంలో 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో పాటు 2GB డేటా లభించేది. ఇప్పుడు వ్యాలిడిటీని 24 రోజులకు, డేటాను 1GBకి తగ్గించారు.
Also Read
- AI Jobs Impact: AI ప్రభావం.. 9.2 కోట్ల ఉద్యోగాలు మాయం.. కానీ, 17 కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలు
- 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- కొత్త 'ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే'తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
- Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
కొత్త రూ.1 ప్లాన్‌లో 24 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలవ్యవధిలో ప్రతిరోజూ 1GB డేటా వినియోగించుకోవచ్చు. అంటే మొత్తం 24 రోజుల వ్యవధిలో 24GB డేటా ప్రయోజనం లభిస్తుంది. గతంలో ఉన్న 30 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటాతో పోలిస్తే ప్రస్తుతం ప్రయోజనాలు తగ్గాయి. డేటా ప్రయోజనాలు తగ్గినప్పటికీ.. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం కొనసాగుతోంది. అలాగే ప్రతిరోజూ 100 SMSలు పంపుకునే అవకాశం కూడా ఉంది. దీంతో తక్కువ మొత్తంలో సేవలను ప్రారంభించాలనుకునే కొత్త కస్టమర్లకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉండనుంది.
కొత్త కస్టమర్లను వేగంగా ఆకర్షించడమే ఈ రూ.1 FRC ప్లాన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. సిమ్ యాక్టివేషన్ కోసం పెద్ద మొత్తంలో మొదటి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకపోవడంతో కొత్త యూజర్లు BSNL సేవలను తక్కువ ఖర్చుతో సేవలు పొందవచ్చు. సేవలు నచ్చితే ఆ తర్వాత తమ అవసరాలకు అనుగుణంగా ఇతర రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకోవచ్చు.
Get the Freedom2.0 Plan for just ₹1 and experience true digital freedom with BSNL!
Enjoy unlimited calls,
2GB data per day,
100 SMS per day,
and a free SIM,
all with a 24 days validity.Available exclusively for new customers.#BSNLIndia #IndependenceDayWithBSNL@CMDBSNL pic.twitter.com/gJpzPGvcEs
— BSNL_Andhrapradesh (@bsnl_ap_circle) August 13, 2026
తాజావార్తలు
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
Vishwanath And Sons Review : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ.. సూపర్బ్ ఫస్టాఫ్.. సెకండాఫ్?
-
Nepal Gorkhas: “మేము భారత సైన్యంలో చేరుతాం”.. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
-
AI Jobs Impact: AI ప్రభావం.. 9.2 కోట్ల ఉద్యోగాలు మాయం.. కానీ, 17 కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలు
-
CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!