BSNL Recharge: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) తాజాగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా, తక్కువ ధరలో మంచి సేవలను అందిస్తూ జియో, ఎయిర్‌టెల్, విఐ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడుతోంది.బిఎస్ఎన్ఎల్ రూ.1999 ప్లాన్ (BSNL Rs 1999 Plan) ద్వారా వినియోగదారులు రోజుకు కేవలం రూ.5తో ఏడాదిపాటు సేవలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక ఈ రూ.1999 ప్లాన్ విషయానికి వస్తే.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీగా అన్‌లిమిటెడ్ కాలింగ్ (unlimited calling) చేసే అవకాశం ఉంది. సంవత్సరం పాటు వినియోగించే 600GB డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా డేటా ఎక్కువగా వినియోగించే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారు, వీడియోలు చూస్తున్న వారు, లేదా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వారికి ఇది సరైన ఎంపిక.
Also Read: Sid Sriram : హైదరాబాద్‌లో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్.. ఎప్పుడంటే..?
ఇదే రూ.1999 ప్లాన్ ఎయిర్‌టెల్ తో పోలిక చేస్తే.. ఇందులో కేవలం 24GB డేటా మాత్రమే అందిస్తోంది. అంటే నెలకు 2GB మాత్రమే. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు అందిస్తున్నా, బిఎస్ఎన్ఎల్ ప్లాన్‌తో పోల్చితే ఇది తక్కువ ప్రయోజనాలున్న ప్లాన్‌గా మారుతుంది. ఇకపోతే, ప్రైవేట్ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచడం వల్ల బిఎస్ఎన్ఎల్ కు కొత్త కస్టమర్లు చేరుతున్నారు. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయోజనాలను అందించడమే బిఎస్ఎన్ఎల్ విజయ రహస్యం.
Also Read: Donald Trump 2.0: అధ్యక్షుడిగా ట్రంప్ సంచలన ప్రకటన
మరోవైపు బిఎస్ఎన్ఎల్ జనవరి 17న నుండి కొత్త ఇంట్రా సర్కిల్ రోమింగ్ (BSNL ICR feature) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల సిమ్ పనిచేయకపోయినా, అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌నైనా వాడుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టవర్ సపోర్ట్ చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.1999 ప్లాన్ నిజంగానే వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి సేవలను పొందాలనుకునేవారు ఈ ప్లాన్‌ను తప్పక పరిశీలించాలి. బిఎస్ఎన్ఎల్ ఈ దూకుడును కొనసాగిస్తే, టెలికాం రంగంలో మరిన్ని మార్పులు రావడం ఖాయం.