BSNL: మదర్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్.. ఆ ప్లాన్స్ పై 5% తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ‘మదర్స్ డే’ సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మే 7 నుండి మే 14 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది మదర్స్ డే మే 11, ఆదివారం నాడు వస్తోంది. ఈ సందర్భంగా BSNL మూడు లాంగ్‌వాలిడిటీ ప్లాన్లపై 5 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌ను BSNL తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించింది. రూ.2399, రూ.997, రూ.599 ప్లాన్లపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. వినియోగదారులు BSNL వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేస్తేనే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి.
Read Also: Mock Drill: సైరన్ మోగిన వెంటనే ఏం చెయ్యాలంటే?
Also Read
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ఇందులో భాగంగా రూ.2399 ప్లాన్ ఇప్పుడు రూ.2279కి, రూ.997 ప్లాన్ ఇప్పుడు రూ.947కి, రూ.599 ప్లాన్ ఇప్పుడు రూ.569కి డిస్కౌంట్ తర్వాత ప్లాన్ ధరలు ఉండనున్నాయి. దీంతో వినియోగదారులు మొత్తం రూ.120 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
రూ.2399 ప్లాన్ వివరాలు:
ఈ ప్లాన్‌కు 395 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. వినియోగదారులకు ఇండియావ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, ప్రతి రోజు 100 ఉచిత SMS లభిస్తాయి. అంతేకాకుండా, BiTV యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా 350కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను మొబైల్‌లో వీక్షించవచ్చు.
Read Also: India Pakistan War: భారత వైమానిక దాడిలో పాక్ ఎలా ధ్వంసమైందో ఈ చిత్రాలు చూడండి..
రూ.997 ప్లాన్ వివరాలు:
160 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో కూడా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, 100 ఉచిత SMS లభిస్తాయి. BiTV యాక్సెస్ కూడా ఉచితంగానే లభిస్తుంది.
రూ.599 ప్లాన్ వివరాలు:
ఈ ప్లాన్‌కు 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో రోజుకు 3GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100 ఉచిత SMS లభిస్తాయి. BiTV యాక్సెస్ ఉచితంగా ఉంటుంది. మొత్తం మీద, ఈ మదర్స్ డే సందర్భంగా BSNL ఇచ్చే ఈ ప్రత్యేక ఆఫర్‌ను వినియోగదారులు వినియోగించుకుని తక్కువ ధరలో లాంగ్ వాలిడిటీతో కూడిన సేవలను పొందవచ్చు.
This Mother’s Day, recharge with love.
Celebrate with BSNL and get 5% Recharge Contribution + Extra Validity when you recharge your Mother’s number. Valid on select BSNL plans.
Offer valid from 7th to 14th May.
Recharge via the BSNL Website – https://t.co/eiDdBNjHQX
Or… pic.twitter.com/7ZRb7LTkL2— BSNL India (@BSNLCorporate) May 7, 2025
తాజావార్తలు
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!