Mock Drill: హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు సీపీ ఆనంద్ ప్రజలకు డ్రిల్ సమయంలో ఏం జరగబోతుంది? ఆ సమయంలో ఎలా ఉండాలని తాజాగా సూచించారు. ఇందులో భాగంగా అయన మాట్లాడుతూ.. 55 ఏళ్లనాటి వార్ సైరన్ ను వాడుతున్నామని, అలాగే సైరన్ మోగిన సమయంలో ఏమి చెయ్యాలి అనే దానిమీద అవగణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read Also: Pakistan: భారత్‌పై యుద్ధానికి సిద్ధమైన పాక్.. దేశాన్ని ఉద్దేశించి పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రసంగం..
డ్రిల్ మధ్యాహ్నం 4 గంటలకు నగరమంతా సైరన్లు వినిపిస్తాయని, ప్రతిఒక్కరు ఆ సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నగరంలోని పోలీసు, అగ్నిమాపక, పారిశ్రామిక విభాగాలు 2 నిమిషాల్లో నగరంలోని అన్ని సైరన్లు మోగిస్తాయని తెలిపారు. ఇక సైరన్ వినిపించినప్పుడు ప్రజలు వెంటనే భద్రత కలిగిన ప్రదేశానికి వెళ్లాలని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లాలని ఆయన అన్నారు. సైరన్ మోగిన వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని, వాహనం మీద ఉన్న వాళ్ళు పక్కకు అపి పక్కకు వెళ్ళాలని సూచించారు.
Read Also: India Pakistan War: భారత వైమానిక దాడిలో పాక్ ఎలా ధ్వంసమైందో ఈ చిత్రాలు చూడండి..
ఆ తర్వాత మధ్యాహ్నం 4 గంటల 15 నిమిషాలకు రెండో సైరన్ మోగిస్తాము తెలిపారు. ఇది నగరంలోని 4 వేర్వేరు ప్రదేశాల్లో వైమానిక దాడి ప్రభావం గురించి రక్షణ సేవలను అప్రమత్తం చేస్తుంది. ఫైర్, హెల్త్, పోలీస్, రెవినవే, GHMC, SDRF, ట్రాన్స్పోర్ట్ లతో ముందుకు వెళ్తామని సీపీ ఆనంద్ తెలిపారు. ఈ రోజు నుంచి అందరి లీవ్ క్యాన్సల్ చేశామని, ఏ డిపాట్మెంట్ ఏమి చేయాలో సూచించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఫేక్ న్యూస్ ప్రచారం మీద దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా మెడికల్ అండ్ హీల్త్ డిపాట్మెంట్ వాళ్ళు హాస్పిటల్ మీద రెడ్ క్రాస్ మార్క్ చేయాలని ఆయన సూచించారు. కేంద్రం ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ నిర్వహిస్తున్నామని, ఫేక్ న్యూస్ నమ్మకండని అన్నారు. హెల్త్, GHMC, ట్రాన్స్ఫర్ట్ అన్నీ టైమ్ లో సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా NDRF సిద్దంగా ఉండాలని సూచించారు.