Site icon NTV Telugu

BSNL: మదర్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్‌.. ఆ ప్లాన్స్ పై 5% తగ్గింపు!

Bsnl

Bsnl

BSNL: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ‘మదర్స్ డే’ సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మే 7 నుండి మే 14 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది మదర్స్ డే మే 11, ఆదివారం నాడు వస్తోంది. ఈ సందర్భంగా BSNL మూడు లాంగ్‌వాలిడిటీ ప్లాన్లపై 5 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌ను BSNL తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించింది. రూ.2399, రూ.997, రూ.599 ప్లాన్లపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. వినియోగదారులు BSNL వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేస్తేనే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి.

Read Also: Mock Drill: సైరన్ మోగిన వెంటనే ఏం చెయ్యాలంటే?

ఇందులో భాగంగా రూ.2399 ప్లాన్ ఇప్పుడు రూ.2279కి, రూ.997 ప్లాన్ ఇప్పుడు రూ.947కి, రూ.599 ప్లాన్ ఇప్పుడు రూ.569కి డిస్కౌంట్ తర్వాత ప్లాన్ ధరలు ఉండనున్నాయి. దీంతో వినియోగదారులు మొత్తం రూ.120 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

రూ.2399 ప్లాన్ వివరాలు:
ఈ ప్లాన్‌కు 395 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. వినియోగదారులకు ఇండియావ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, ప్రతి రోజు 100 ఉచిత SMS లభిస్తాయి. అంతేకాకుండా, BiTV యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా 350కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను మొబైల్‌లో వీక్షించవచ్చు.

Read Also: India Pakistan War: భారత వైమానిక దాడిలో పాక్ ఎలా ధ్వంసమైందో ఈ చిత్రాలు చూడండి..

రూ.997 ప్లాన్ వివరాలు:
160 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో కూడా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, 100 ఉచిత SMS లభిస్తాయి. BiTV యాక్సెస్ కూడా ఉచితంగానే లభిస్తుంది.

రూ.599 ప్లాన్ వివరాలు:
ఈ ప్లాన్‌కు 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో రోజుకు 3GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100 ఉచిత SMS లభిస్తాయి. BiTV యాక్సెస్ ఉచితంగా ఉంటుంది. మొత్తం మీద, ఈ మదర్స్ డే సందర్భంగా BSNL ఇచ్చే ఈ ప్రత్యేక ఆఫర్‌ను వినియోగదారులు వినియోగించుకుని తక్కువ ధరలో లాంగ్ వాలిడిటీతో కూడిన సేవలను పొందవచ్చు.

Exit mobile version