Site icon NTV Telugu

BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!

Bsnl Launches Quantum 5g Fwa

Bsnl Launches Quantum 5g Fwa

BSNL Launches Quantum 5G FWA: ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) దేశీయ 5G సేవలకు అడుగు పెట్టింది. తాజాగా హైదరాబాద్‌ లోని ఎక్సేంజ్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో Quantum 5G FWA (Fixed Wireless Access) సేవలను లాంచ్‌ చేశారు. ఈ ప్రారంభోత్సవంలో బిఎస్ఎన్ఎల్, దూరసంచార శాఖ (DoT) ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జరిగిన ట్రయల్స్‌లో 980 Mbps డౌన్‌ లోడ్, 140 Mbps అప్లోడ్ వేగాలు నమోదు అయ్యాయి. 10 మిల్లీసెకన్లలోపు లేటెన్సీతో 4K స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్, రిమోట్ వర్క్‌కి ఇది అద్భుతంగా సరిపోనుంది.

Read Also:boAt Airdopes Prime 701 ANC: 50 గంటల ప్లేబ్యాక్‌, 46dB నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చేసిన కొత్త ఇయర్‌బడ్స్..!

ఇక ఈ BSNL Quantum 5G ప్రత్యేకత విషయానికి వస్తే.. బిఎస్ఎన్ఎల్ రూపొందించిన Direct-to-Device (D2D) వేదికతో ఫిజికల్ సిమ్‌ అవసరం లేకుండా ఆటో-ఆథెంటికేషన్‌ జరగడం ద్వారా భారత్‌లోనే మొట్టమొదటి SIM-less 5G సేవగా గుర్తింపు పొందింది. అలాగే బిఎస్ఎన్ఎల్ కోర్ నుండి రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ (RAN), కస్టమర్ ప్రెమైజ్‌ ఎక్విప్‌మెంట్‌ (CPE) వరకు మొత్తం వ్యవస్థ ఆత్మనిర్భర్ భారత్ పథకంలోని ఫలితంగా పూర్తిగా స్వదేశీంగా అభివృద్ధి చేయబడింది. హైదరాబాద్‌ లోని బిఎస్ఎన్ఎల్ టవర్ గ్రిడ్ ఆధారంగా 85% హౌస్‌ హోల్డ్ కవరేజ్ తో ఫైబర్ లేకుండా వేగంగా అమలు చేయగల సేవగా రూపొందించబడింది.

Read Also:Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

ఇక ఈ సేవలు 2025 సెప్టెంబర్‌ నాటికి బెంగళూరు, విశాఖపట్నం, పాండిచ్చేరి, పుణే, గ్వాలియర్‌, చండీగఢ్‌ లలో పైలట్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ ప్లాన్ సంబంధించిన వివరాలను చూసినట్లయితే.. ప్రారంభ ధర రూ. 999 కి 100 Mbps, అలాగే రూ. 1499 కి 300 Mbps స్పీడ్‌ అందించనున్నారు. ఇక MSMEs, వ్యాపార అవసరాల కోసం ప్రత్యేక SLA-backed నెట్‌వర్క్‌ స్లైసింగ్‌, 5G స్టాండ్ అలొన్ కోర్‌ ఆధారంగా పని చేస్తుంది.

Exit mobile version