BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Launches Quantum 5G FWA: ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశీయ 5G సేవలకు అడుగు పెట్టింది. తాజాగా హైదరాబాద్ లోని ఎక్సేంజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో Quantum 5G FWA (Fixed Wireless Access) సేవలను లాంచ్ చేశారు. ఈ ప్రారంభోత్సవంలో బిఎస్ఎన్ఎల్, దూరసంచార శాఖ (DoT) ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జరిగిన ట్రయల్స్‌లో 980 Mbps డౌన్ లోడ్, 140 Mbps అప్లోడ్ వేగాలు నమోదు అయ్యాయి. 10 మిల్లీసెకన్లలోపు లేటెన్సీతో 4K స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్, రిమోట్ వర్క్‌కి ఇది అద్భుతంగా సరిపోనుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక ఈ BSNL Quantum 5G ప్రత్యేకత విషయానికి వస్తే.. బిఎస్ఎన్ఎల్ రూపొందించిన Direct-to-Device (D2D) వేదికతో ఫిజికల్ సిమ్ అవసరం లేకుండా ఆటో-ఆథెంటికేషన్ జరగడం ద్వారా భారత్‌లోనే మొట్టమొదటి SIM-less 5G సేవగా గుర్తింపు పొందింది. అలాగే బిఎస్ఎన్ఎల్ కోర్ నుండి రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (RAN), కస్టమర్ ప్రెమైజ్ ఎక్విప్‌మెంట్ (CPE) వరకు మొత్తం వ్యవస్థ ఆత్మనిర్భర్ భారత్ పథకంలోని ఫలితంగా పూర్తిగా స్వదేశీంగా అభివృద్ధి చేయబడింది. హైదరాబాద్ లోని బిఎస్ఎన్ఎల్ టవర్ గ్రిడ్ ఆధారంగా 85% హౌస్ హోల్డ్ కవరేజ్ తో ఫైబర్ లేకుండా వేగంగా అమలు చేయగల సేవగా రూపొందించబడింది.
Read Also:Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
ఇక ఈ సేవలు 2025 సెప్టెంబర్ నాటికి బెంగళూరు, విశాఖపట్నం, పాండిచ్చేరి, పుణే, గ్వాలియర్, చండీగఢ్ లలో పైలట్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ ప్లాన్ సంబంధించిన వివరాలను చూసినట్లయితే.. ప్రారంభ ధర రూ. 999 కి 100 Mbps, అలాగే రూ. 1499 కి 300 Mbps స్పీడ్ అందించనున్నారు. ఇక MSMEs, వ్యాపార అవసరాల కోసం ప్రత్యేక SLA-backed నెట్‌వర్క్ స్లైసింగ్, 5G స్టాండ్ అలొన్ కోర్ ఆధారంగా పని చేస్తుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..