NTV Telugu Site icon

BSNL: ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోన్న BSNL.. రూ.1515కే ఏడాదిపాటు!

Bsnl

Bsnl

BSNL: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఇప్పుడు ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బలమైన సవాల్ విసురుతోంది. తన తాజా డేటా ప్లాన్‌తో BSNL కేవలం రూ.1515 లో 365 రోజులపాటు ప్రతిరోజు 2GB డేటా అందించడానికి సిద్ధమైంది. దీనిని ప్రైవేట్ టెలికాం కంపెనీలను ఎదుర్కొనే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్ కేవలం డేటా వోచర్ మాత్రమే. రోజుకు 2GB డేటా అందిచనుండగా, ఆ తరువాత ౪౦కేబీపీస్ డేటా స్పీడ్‌తో కొనసాగుతుంది.

Also Read: Maha kumbh mela: ఇంకా తీరని ట్రాఫిక్ కష్టాలు.. నిండుకున్న పెట్రోల్, ఆహారం.. భక్తులు అవస్థలు

రూ.1515 ప్లాన్ ప్రత్యేకతలు:

* రూ.1515 కే 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా

* డేటా వోచర్ మాత్రమే (కాల్, SMS బెనిఫిట్స్ ఉండవు)

* 2GB డేటా పూర్తి అయిన తర్వాత కనెక్షన్ తగ్గిన 40Kbps స్పీడ్‌తో కొనసాగుతుంది

* రోజుకు సగటున రూ.4 ఖర్చు

ఈ ప్లాన్ ప్రాధాన్యంగా డేటా అవసరం ఉన్నవారికి విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ డేటా బ్రౌజ్ చేసే వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది. BSNL ఈ ప్లాన్‌ను ప్రతిసారి రీఛార్జ్ చేయాల్సిన బాధ లేకుండా ఇంటర్నెట్ వాడాలనుకునే వారికి మంచి ఆప్షన్‌గా అందిస్తోంది. జస్ట్ రూ.1515 పెడితే, ఏడాది మొత్తానికి ఇంటర్నెట్ వాడుకోవచ్చు అని BSNL ప్రకటించింది. ఇది ఒక అద్భుతమైన డేటా ప్లాన్ అని వారు తెలిపారు. ఇది ఇలా ఉండగా, BSNL కొత్త ప్లాన్లతో పాటు కొన్ని పాత ప్లాన్లను కూడా తొలగిస్తున్నది. 201, 797, 2999 ప్లాన్లు ఫిబ్రవరి 10, 2025 నుండి అందుబాటులో ఉండవు. తరచూ ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకునే వారు ఈ మార్పు గమనించాల్సి ఉంటుంది. కంపెనీ తక్కువ ధరలోనే ఎక్కువ విలువ ఇచ్చే ప్లాన్లపై దృష్టి పెడుతోంది.

మొత్తానికి BSNL తన కొత్త డేటా ప్లాన్‌తో టెలికాం రంగంలో దిమ్మతిరిగే పోటీని ప్రారంభించింది. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువ ధరలో 365 రోజుల పాటు డేటా అందించడం కష్టమైన విషయం. BSNL ఈ కొత్త ప్లాన్‌తో మరింత వినియోగదారులని ఆకర్షించగలుగుతుందని భావిస్తున్నారు.