Indonesia President : భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుబియాంటో శనివారం భారతదేశానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి, ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈరోజు (శనివారం) ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశం అయ్యారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో నాల్గవ వ్యక్తి. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ ఇండోనేషియా అధ్యక్షుడికి స్వాగతం పలికారు. భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా ముఖ్య అతిథి దేశంగా ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు మరోసారి భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఇండోనేషియా మరోసారి ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావడం గర్వకారణం. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను భారతదేశానికి స్వాగతిస్తున్నాను అన్నారు.
సైబర్ భద్రత, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తాను : మోదీ
‘‘2018లో నేను ఇండోనేషియా పర్యటన సందర్భంగా, మా భాగస్వామ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ముందుకు తీసుకెళ్లాం’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు అధ్యక్షుడు ప్రబోవోతో పరస్పర సహకారం పై విస్తృత చర్చ జరిగింది. రక్షణ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, తయారీ, సరఫరాలో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, తీవ్రవాద నిర్మూలన రంగాలలో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి.
Read Also:Nuvve Kavali: మూడు దేశాల్లో 50 లక్షల ఖర్చుతో మెహబూబ్, శ్రీ సత్యల ఆల్బమ్ సాంగ్
భద్రత రంగంలో ఈరోజు సంతకం చేసిన ఒప్పందం నేరాల నివారణ, శోధన, రక్షణచ, సామర్థ్య నిర్మాణంలో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందింది. గత సంవత్సరం ఇది 30 బిలియన్ డాలర్లను దాటింది.
అధ్యక్షుడు ప్రబోవో ఏమి చెప్పారు?
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మాట్లాడుతూ.. “భారతదేశానికి నా మొదటి అధికారిక పర్యటన సందర్భంగా నాకు లభించిన గౌరవానికి కృతజ్ఞతను తెలుపుతున్నాను. ఈరోజు అధ్యక్షుడు నన్ను ఎంతో గౌరవంగా స్వాగతించారు. ప్రధానమంత్రి మోడీ, ఆయన ప్రభుత్వం, నేను, నా ప్రభుత్వం మధ్య చాలా విస్తృత చర్చ జరిగింది.’’ అన్నారు.
Read Also:PM Modi : నెలలోపే ప్రధాని మోదీ రెండో సారి ఒడిశా పర్యటన.. కారణం ఇదే