బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ B, గ్రూప్ C కోసం 141 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ను ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bsf.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. BSF రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా భర్తీ చేయబోయే పోస్టులలో పారామెడికల్ స్టాఫ్, SMT వర్క్ షాప్, వెటర్నరీ స్టాఫ్, లైబ్రేరియన్ లో వివిధ గ్రూప్ B, C పోస్ట్‌లు ఉన్నాయి.
Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్
ఈ ఉద్యోగాలకు GNM, ల్యాబ్ టెక్నీషియన్, ITI, 10th పాస్, 12th పాస్, లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ అర్హత అవసరం. 21 – 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వ్రాత పరీక్ష, భౌతిక పరీక్ష, నైపుణ్య పరీక్ష, పత్రాల ధృవీకరణ, వైద్య పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇక ఇందులో ఉద్యోగాల జీతాల వివరాలు చూస్తే..
పారా మెడికల్ స్టాఫ్ (గ్రూప్-బి): పే స్కేల్ లెవెల్-6 కింద నెలకు రూ. 35,400 – 1,12,400.
పారా మెడికల్ స్టాఫ్ (గ్రూప్-సి): పే స్కేల్ లెవెల్-5 కింద రూ. 29,200 – 92,300
SMT వర్క్‌షాప్ (గ్రూప్-బి): పే స్కేల్ లెవెల్-6 కింద రూ. 35,400 – 1,12,400
SMT వర్క్‌షాప్ (గ్రూప్-C) కానిస్టేబుల్: పే స్కేల్ లెవెల్-5 కింద రూ. 21,700 – 69,100
వెటర్నరీ స్టాఫ్ (గ్రూప్-సి) హెడ్ కానిస్టేబుల్: రూ. 25,500 – 81,100
కానిస్టేబుల్: రూ.21,700 – 69,100
ఇన్‌స్పెక్టర్ గ్రూప్-బి: పే స్కేల్ లెవెల్-7 కింద రూ. 44,900 – 1,42,400
Palastina Refugees: పాలస్తీనా శరణార్థులకు భారత్ భారీ ఆర్థిక సహాయం.. ఎంతో తెలుసా..?
ఇక ఈ ఉద్యోగాల దరకాస్తు కోసం జనరల్, OBC , EBC లకు రూ.100 పరీక్ష ఫీజ్ ఉంటుంది. SC, ST లకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు. ఇక ఈ ఉద్యోగాలకోసం అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in కి వెళ్లి., హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ విభాగంపై క్లిక్ చేయండి. ఆపై దరఖాస్తు లింక్ పై క్లిక్ చేయండి. అక్కడ ఫామ్ ను పూర్తి చేసి ఫీజు చెల్లించాలి. అంత ఐపోయాక ప్రింట్ అవుట్ తీసుకోండి.