Gas Protest : మరోసారి భారీగా గ్యాస్ ధర పెరగడం తో సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మార్చి ఒకటి నుండి భారీగా పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 రూపాయలు పెరిగింది. అలాగే, 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 350.50 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డొమెస్టిక్ సిలిండర్ ధర 1155 రూపాయలకు చేరింది. ఇక గ్యాస్ సిలిండర్ పెరుగుదలతో.. కేంద్ర ప్రభుత్వంపై సామాన్యులు మరోసారి ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతుంటే..ఇప్పుడు గ్యాస్ ధర ఏకంగా రూ. 50 పెంచడం ఫై కేంద్రం ఫై నిప్పులు చెరుగుతున్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది.
Read Also: Dog Bite: కుక్క కరిస్తే ఏమి చేయాలి?
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ మున్సిపాలిటీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్లలోని హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపైపెంచిన వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొండి వైఖరి మరియు పెరిగిన వంట గ్యాస్ ధరలకు నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్ ధరలు సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా వారిపై భారం మోపుతూ వంట చేసుకునే పరిస్థితి లేదు అన్నారు. ఉజ్వల ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి సబ్సిడీ ఇవ్వక పోగా నెలకు ఒకసారి గ్యాస్ ధరలు పెంచుతుందని, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్మిక, కర్షక, పేద మధ్య తరగతి ప్రజలపై కక్ష గట్టి రాక్షతత్వం చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలని వారన్నారు.