Site icon NTV Telugu

Boinapally Vinod Kumar: రిమోట్‌ ఓటింగ్ విధానాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోంది..

Boinapally Vinod Kumar

Boinapally Vinod Kumar

Boinapally Vinod Kumar: రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వ్య‌తిరేకిస్తోందని రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఆ పద్ధతి దేశంలో అవసరం లేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలే రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప‌క్క‌న పెడుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీగా తాము రిమోట్ ఓటింగ్ విధానాన్నివ్య‌తిరేకిస్తున్నామన్నారు.

Konda Surekha Face To Face: బీఆర్ఎస్ అనేది కేసీఆర్ నాటకం.. రేవంత్ పాదయాత్ర చేయాల్సిందే!

ఎన్నిక‌ల్లో వాడుతున్న ఈవీఎంల‌ను హ్యాక్ చేస్తున్నార‌నే అనుమానాలు, ప్ర‌చారాలు బ‌లంగా ఉన్నాయన్నారు. వాటినే ఈసీ ఇప్ప‌టి వ‌ర‌కు నివృత్తి చేయ‌లేదు. అలాంటప్పుడు మ‌ల్టీ కానిస్టిట్యూయెన్సీ రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వ‌సిస్తామని అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్ దేశాలే ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌ను ప‌క్క‌న‌ పెట్టేశాయన్నారు. నిత్యం బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేస్తున్న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయని.. అలాంట‌ప్పుడు ఎక్క‌డో విదేశాల్లో ఉన్న వ్య‌క్తి పేరుతో వేసే ఓట్ల‌ను ఎలా న‌మ్మ‌గ‌లమని ప్రశ్నించారు. అక్క‌డి నుంచి ఆ ఓట‌రే ఓటు వేస్తున్నాడా..? హ్యాక్ చేస్తున్నారా..? ఎలా తెలుసుకోగ‌లమని ఆయన అన్నారు.

Exit mobile version