Site icon NTV Telugu

BRS MP’s : బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఫైర్‌

Nama

Nama

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇవాళ పార్లమెంట్‌లో ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అది వీగిపోయింది. అయితే.. ఈ రోజు పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ అనంతరం బీఆర్‌ఎస్‌ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నుంచి అవిశ్వాస తీర్మానం ఇచ్చామని, మూడు రోజుల చర్చలో అరగంట సమయం కావాలని కోరామన్నారు. ప్రధాని ప్రసంగాన్ని ఓపికగా మేం విన్నామని, తెలంగాణ కు జరిగిన అన్యాయాన్ని సభలో వివరించామన్నారు.

Also Read : Jabardasth Varsha: రెడ్ స్కర్టులో జబర్దస్త్ వర్ష గ్లామర్ ట్రీట్.. చూస్తే తట్టుకోగలరా?

ప్రధాని తన ప్రసంగంలో తెలంగాణ గురించి మాట్లాడలేదని, బండి సంజయ్ నోటికి వచ్చినట్లు, పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన వెల్లడించారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడమే వాళ్ళ పని అని, తెలంగాణ అంటేనే కేంద్రానికి గిట్టడం లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని ఆయన విమర్శించారు. బండి సంజయ్ మాటలు సిగ్గు చేటని, రైతుల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. కరెంట్ లేదంటే బండి సంజయ్ నీ రైతులు తరిమి కొడతారన్నారు.

Also Read : Sobitha Dhulipalla: వింత జాకెట్టులో శోభిత హాట్ ట్రీట్.. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే!

అనంతరం బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. బండి సంజయ్ తోక రాష్ట్రంలో కత్తిరించినా సరే మళ్లీ మోదీని పొగుడుతూ మార్కులు కొట్టేయాలని చూశారన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆమె హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 86 వేల కోట్లు ఇచ్చామనడం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు. బండి సంజయ్ బహిరంగ సభలో మాట్లాడినట్టు డ్రామా వేసినట్టు బఫూన్‌లా సభలో మాట్లాడారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తెలంగాణకు ఇచ్చిన స్టీల్ ప్లాంట్, కోచ్ ఫ్యాక్టరీ హామీల గురించి మాట్లాడకుండా విమర్శలకు దిగారని ఆమె విమర్శించారు.

Exit mobile version