సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మరావు గౌడ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ర్యాలీతో అదరగొట్టారు. ఈ బైక్ ర్యాలీకి వేలాదిగా బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ భారీ ర్యాలీతో లష్కర్ రోడ్ మొత్తం గులాబీ సైన్యంతో నిండిపోయింది.
Read Also: Aa Okkati Adakku OTT : నెలలోపే ఓటీటీలోకి రాబోతున్న అల్లరి నరేష్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కాగా, నేటి ప్రచారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించారు. అయితే, మారేడ్ పల్లి షెనై గ్రౌండ్ నుంచి మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ లు కలిసి ర్యాలీని ప్రారంభించగా.. 7 నియోజిక వర్గాలను కలుపుతూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ బైక్ నడుపుతూ సందడి చేయగా బైక్ పై కూర్చొన్న తలసాని అందరికి అభివాదం చేశారు. కొద్దీ దూరం పాటు ర్యాలీగా వెళ్లిన తర్వాత జీప్ లోకి ఎక్కి అందరికి అభివాదం చేస్తూ.. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ విజ్ఞప్తి చేశారు.
