టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు కూడా యాక్షన్ కథతో చేశాడు.. ఈ ఏడాది నా సామిరంగ సినిమా చేశాడు. ఇప్పుడు తాజాగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..
ఈ 61వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ఆ ఒక్కటి అడక్కు`. మల్లి అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఇటీవలే థియేటర్లలోకి వచ్చేసింది.. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది.. కామెడితో కడుపుబ్బా నవ్వించేసింది.. ఇప్పుడు ఓటిటిలోకి రాబోతుందని సమాచారం..
ఈ సినిమా నెల రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు ఓటిటిలో విడుదల కాబోతుందని తెలుస్తుంది.. మే 31న స్ట్రీమింగ్ కు రెడీ అవుతుందని టాక్.. మే లాస్ట్ వీక్‌లో ఆ ఒక్కటి అడక్కు ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్నట్లు సమాచారం.. కథ కొంచెం కొత్తగా ఉండటంతో సినిమా మంచి టాక్ ను అందుకుంది.. మరి ఓటీటీలో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చుడాలి..