Site icon NTV Telugu

BRS: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..

Madhusudhana Chary

Madhusudhana Chary

తెలంగాణ శాసన సభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి ప్రారంభమైన కాసేపటికే శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించాలని.. పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలి అంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మాట్లాడుతూ.. కేంద్రం పసుపు బోర్డు ప్రకటించిన కానీ దానికి చట్టబద్దత లేదని ఆరోపించారు. నామమాత్రపు ప్రకటన చేసింది.. తక్షణమే పసుపు బోర్డుకు కేంద్రం చట్టబద్దత కల్పించాలని మధుసూదనా చారి డిమాండ్ చేశారు.

Read Also: IML 2025 Final: ఫైనల్ చేరిన వెస్టిండీస్.. టైటిల్ కోసం భారత్తో అమితుమీ

పసుపుకు రూ.9 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15 వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు చెల్లించలేదని మధుసూదనా చారి తెలిపారు. రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.. కేసీఆర్ నాయకత్వంలో రైతుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని మధుసూదనా చారి వెల్లడించారు.

Read Also: IPL 2025 Captains: ఈసారి ఐపిఎల్ లో కొత్త కెప్టెన్స్ వీళ్లే..

మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది. ఈ క్రమంలో.. తెలంగాణ అసెంబ్లీ దద్దిరిల్లే అవకాశం ఉంది. రైతు భరోసా, దావోస్ పెట్టుబడులు, ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లతో పాటు పలు అంశాలపై గవర్నర్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారమే చర్చ జరగాల్సి ఉండగా.. విపక్షాల నినాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో.. ఎమ్మె్ల్యే జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. నిన్న హోళీ కావడంతో అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. దీంతో ఇవాళ గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ సమాధానం ఇవ్వనున్నారు.

Exit mobile version