తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు.18 ఏళ్ళు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆందోళన చేపట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ఫ్లకార్డ్స్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన బాట పట్టారు.
Also Read:Danam Nagender: ఇది సీరియస్ మ్యాటర్.. జీరో అవర్ లో దానం గరం గరం
మహిళలకు ఇచ్చిన హామీని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి నశించాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. “సిగ్గు సిగ్గు కాంగ్రెస్ పార్టీ” అంటూ కాంగ్రెస్ వైఖరిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎండగట్టారు. నిన్న కూడా మండలి ఆవరణలో మిర్చి రైతులను ఆదుకోవాలని మిర్చి దండలు మెడలో వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.