Site icon NTV Telugu

MLAs Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై మరోసారి హైకోర్టులో విచారణ

Highcourt Ts

Highcourt Ts

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసిన ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించవద్దని ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తున్నారు. అయితే.. కేసులు నమోదు అయినప్పుడు రాజకీయ పరంగా విమర్శలు సర్వసాధారణమని, ఢిల్లీ లిక్కర్ స్కాం కేస్ లోనూ ఆప్ నేతలపై బీజేపీ విమర్శలు చేసిందని దుష్యంత్‌ దవే అన్నారు. ప్రతి విమర్శను టీవీలు చూపిస్తున్నాయని దుష్యంత్‌ దవే అనడంతో.. మేము టీవీలు చూడటం ఎప్పుడో మానేసామన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో.. సిట్ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని, సిట్‌లో ఉన్న ఐపీఎస్ లపై ఎటువంటి ఆరోపణలు లేవని, గతంలో వివిధ కేసుల్లో సుప్రీం కోర్టు జడ్జిమెంట్లలో సిట్ లో ఒక ఐపీఎస్ ఉంటే బావుండేదనీ సుప్రీం కోర్టు వాఖ్యాన్నించిందని దుష్యంత్‌ దవే వివరించారు.

Also Read : Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

ముఖ్య మంత్రి ప్రెస్ మీట్ ను కేంద్రంగా చూపి దర్యాప్తు సంస్థ ను మార్చేస్తారా ? ఇది ఒక ట్రాప్ కేస్ అని సింగిల్ జడ్జి మర్చిపోయారు. నిందితులు ఫార్మ్ హౌస్ కి వచ్చింది వాస్తవం కాదా అని దుష్యంత్‌ దవే అన్నారు. డబ్బు, పదవులు ఎర చూపి ఎం ఎల్ ఏ లను కొనుగోలు చేయాలనుకుంది వాస్తవం కాదా అని, నిందితులు మాట్లాడింది అంతా ఎలక్ట్రానిక్ పరికరాలలో రికార్డ్ అయ్యిందని, డేటా మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్ లో బయట పడిందన్నారు దుష్యంత్‌ దవే . పోలీసుల విచారణను ఎలా తప్పుపడుతామని దుష్యంత్‌ దవే హైకోర్టుకు ప్రభుత్వం తరుఫు వాదనలు వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రతివాదుల వాదనలు ముగిశాయి.

Also Read : Ruhani Sharma: నాని చేతుల మీదుగా ‘హర్’ టీజర్!

Exit mobile version