NTV Telugu Site icon

BRS Party: ఇప్పటికైనా అబద్దాలు మాని.. అభయ హస్తం హామీల అమలు గురించి ఆలోచించండి

Brslp

Brslp

బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మాని అభయ హస్తం హామీల అమలు గురించి ఆలోచించండని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీల అమలుకు తేదీలు కూడా చెప్పారు.. ఆ తేదీలు గడిచిపోయినా ఇచ్చిన హామీల గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి గురించి ఎన్నికల్లో చెప్పి.. ఎప్పుడు చెప్పామని భట్టి అసెంబ్లీలో అన్నారని తెలిపారు. అవసరమైతే ఆరు నెలలు అయినా తీసుకోండి.. కానీ 412 హామీలు అమలు చేయండని పేర్కొన్నారు.

Read Also: Bihar: రహస్య సమావేశం, సీఎంగా తేజస్వి.. జేడీయూ చీఫ్‌గా లలన్‌సింగ్ తొలగింపు స్టోరీ ఇదే!

సీఎం రేవంత్ ల్యాండ్ కృసర్ వాహనాల గురించి పిచ్చిగా మాట్లాడుతున్నారు.. ఆ వాహనాలు కేసీఆర్ సొంతానికి కొన్నారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఆ వాహనాల్లో ఈ ప్రభుత్వం వాళ్ళు తిరగరా అని అన్నారు. కొంటే తప్పేముంది.. కేబినెట్ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు.. అది దాస్తే దాగుతుందా అని ఎమ్మెల్యేలు తెలిపారు. విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ కోసం వాహనాలు తరలించడం పరిపాటేనన్నారు.

Read Also: Kadiyam Srihari: న్యాయ విచారణ మొదలు కాకముందే మంత్రులు తీర్పులు ఇచ్చేస్తున్నారు..

మరోవైపు.. ఏ సీఎం అయినా సచివాలయంలో లంకె బిందెలు ఉన్నాయని వస్తారా అని ప్రశ్నించారు. అసలు రాత్రి పూట లంకె బిందెల కోసం తిరిగే వారిని ఏమంటారో అందరికి తెలుసన్నారు. సచివాలయంలో డబ్బులు ఉంటాయా అని వారు ప్రశ్నించారు. మన బడ్జెట్ తెలిసే ఇప్పటి ముఖ్యమంత్రి అన్ని హామీలు ఇచ్చాడా అని విమర్శించారు. ఆ హామీలు అమలు చేయడానికి ఎన్ని బడ్జెట్ లు కావాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతికి పేటెంట్.. కాంగ్రెస్ కు అందుకే స్కాం గ్రెస్ గా పేరు వచ్చిందని విమర్శించారు.