NTV Telugu Site icon

Prashanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారు

Prashanth Reddy

Prashanth Reddy

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడం శోచనీయం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు సోమ భరత్ కుమార్, సి. రాకేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు.. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా ఒక ప్లాజాను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

పోలీస్ స్టేషన్స్, ఫుడ్ కోర్ట్స్, బస్ స్టాప్ కట్టాలని కేసీఆర్ అనుకున్నారు.. అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం డిజైన్స్ రూపొందించింది.. జులై 2023లో కొన్ని డిజైన్స్ తెప్పించాము.. ఒక వైపు తెలంగాణ సెక్రటేరియట్, మరో వైపు తెలంగాణ అమర జ్యోతి.. మధ్యలో తెలంగాణ తల్లిని పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆత్మ లింక్‌ను రేవంత్ రెడ్డి కట్ చేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న పేగుబంధం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ఎలాంటి సందర్భం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభిస్తున్నారని తెలిపారు. హామీలు అమలు చేయలేకపోతున్నారు.. కాబట్టి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని డైవర్ట్ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Ram Mohan Naidu: విశాఖ-దుర్గ్‌ వందేభారత్‌ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి

కేసీఆర్ మంచిని కొనసాగించవద్దని రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి గౌరవం పెరిగే విధంగా చర్యలు ఉంటాయి.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కొనసాగించాలని అమరజ్యోతిని కేసీఆర్ నిర్మించారు.. అమెరికాలో ఉన్న చికాగో బీన్ కంటే పెద్దదిగా తెలంగాణ అమరజ్యోతి నిర్మాణం జరిగిందని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపివేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మాత్రం రేవంత్ రెడ్డి కూర్చుంటున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ అమరజ్యోతిలో ఏం జరగేలేదు.. కట్టడంపై అపోహలు ఉంటే తొలగించుకోవాలని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అమరజ్యోతిని చూడటానికి ప్రజలకు అనుమతి ఇవ్వాలి.. నెక్లెస్ రోడ్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించారు.. పార్లమెంట్ నమూనాలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించారు.. అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రజలను అనుమతించడం లేదన్నారు. అంబేద్కర్ జయంతి రోజు సీఎం, మంత్రులు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్ళలేదని అన్నారు. రేవంత్ రెడ్డికి అహంకారం ఎందుకు అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కట్టినందుకే అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రజలను అనుమతించడం లేదా…?. తాము అధికారంలోకి వచ్చాక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Chiranjeevi: తెలంగాణ సీఎంఆర్ఎఫ్ కి చిరు సహా పలువురి విరాళాలు.. ఎవరెవరంటే?

Show comments