నేడు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమార్తె స్ఫూర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. మీ ఒక్క ఓటు జడ్చర్ల అభివృద్ధికి, ప్రజా నాయకుడిని గెలిపించడానికి నియోజకవర్గ ప్రగతికి అడుగులు వేస్తుంది అని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూతురికి మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
Read Also: Black Friday Sale: కళ్లు చెదిరే ఆఫర్స్ తో భారీ సేల్.. ఆ వస్తువుల పై డిస్కౌంట్స్..
మరో వైపు జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. తనను మరోసారి గెలిపిస్తే నియోజక వర్గం అభివృద్దికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి గడపకి ప్రభుత్వ సంక్షేమ ఫలం అందిందన్నారు.. అభివృద్ది చేసే ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ నవంబర్ 30న కారు గుర్తుకు ఓటువేసి అఖండ మెజారిటీ గెలిపించాలన్నారు. గతంలో 11 సార్లు అధికారం ఇస్తే కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వనోళ్లు ఇప్పుడొచ్చి ఉచిత పథకాల పేరుతో హామీ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి రాగానే చేతులు ఎత్తేసారని లక్ష్మారెడ్డి చెప్పారు. నిర్ణయాలు తీసుకునే అధికారం మన చేతిలో ఉండాలంటే బీఆర్ఎస్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు.
Read Also: Minister KTR: మాకు అహంకారం లేదు.. తెలంగాణపై చచ్చేంత మమకారం ఉంది..
కరోనా వచ్చి మా కుటుంబ సభ్యులమంతా నానా అవస్థలు పడుతుంటే ఆనాడు ఎవరూ పట్టించుకోలేదు.. లక్ష్మారెడ్డి సారే నేనున్నానంటూ మాకు భరోసానిచ్చి నిత్యవసర సరుకులు ఇచ్చి ఆదుకున్నాడని ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లు తెలిపారు. నేడు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కష్ట సమయాల్లో మమ్మల్ని ఆదుకున్న లక్ష్మన్న వెంటే తామంతా నడుస్తామని ఆయనకు రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఒక్క పూట కోసం వచ్చి పోయే నాయకులు మాకొద్దని 20 ఏళ్లుగా మా మంచి చెడ్డలు చూస్తున్న లక్ష్మన్నకే మా మద్దతు అంటూ బస్ డ్రైవర్లు ప్రకటించారు.