NTV Telugu Site icon

T. Congress : ఖమ్మంలో స్పీడ్ పెంచిన ఆపరేషన్ ఆకర్ష్‌

Youth Congress

Youth Congress

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓపు మీద ఉంది .మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఖమ్మం అధికారికంగా ధ్రువీకరించుకొని వచ్చారు. మొదటి రోజే ఖమ్మం మీద ఆపరేషన్ ఆకర్షతో దాడి చేస్తున్నారు. వీరి దాడికి బీఆర్ఎస్ పార్టీ విలవిలాడే పరిస్థితి కనపడుతుంది. ఢిల్లీ నుంచి నేరుగా ఖమ్మం కి బయలుదేరి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు టిఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీనికి తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా బాలసాని లక్ష్మీనారాయణ చెప్పారు. ఇకపోతే ఆ వెనువెంటనే బాలసాని లక్ష్మీనారాయణ తీసుకొని ఖమ్మం నగరంలోని బీఆర్‌ఎస్‌ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్ల ఇండ్లలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిరుగుతూ తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు .వీరి ఆహ్వానానికి బీఆర్‌ఎస్‌ పార్టీలోని కార్పొరేటర్లు ఓకే చెబుతున్న పరిస్థితి ఉంది.

ఒక్కసారిగా కాంగ్రెస్ ఆకర్షణ పథకానికి బీఆర్‌ఎస్‌ పార్టీలోని లీడర్లు ఆకర్షతులవుతున్నారు. ఇప్పటికే ఖమ్మం నగరంలోని సీనియర్ కార్పొరేటర్ గా ఉన్న కమ్మర్త మురళి చావా నారాయణరావు సైదా బాబుల ఇంటికి డైరెక్ట్ గా తుమ్మల నాగేశ్వరరావు పొంగలిటి శ్రీనివాస్ రెడ్డి బాలసాని లక్ష్మీనారాయణ వెళ్లి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో వాళ్లు ఓకే చెప్పారు .ఖమ్మం జిల్లా కేంద్రంలో కార్పొరేటర్ లు కూడా ఇప్పటివరకు పువ్వాడ అజయ్ కి వెన్ను దన్నుగా ఉన్నట్లుగా కనబడింది .కానీ ఒక్కసారిగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అభ్యర్థి అని స్పష్టం కాగానే తుమ్మల నాగేశ్వర వెంట పోలోమంటూ కార్పొరేటర్లు బయలుదేరి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు .తాజాగా జరుగుతున్న పరిణామాలు అధికార పార్టీకి ఆందోళన కర్ణగ కనపడుతున్నాయి మంత్రి అజయ్ కుమార్ రాష్ట్ర రాజధాని లో బీఫామ్ తీసుకునేందుకు కోసం వెళ్లగా ఖమ్మం నగరంలో మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్ను దన్నుగా ఉన్న కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని పార్టీలోకి రావని మనీ ఆహ్వానించడం వారు ఓకే అని చెప్పటం సంచలనం కలిగిస్తుంది. రెండుసార్ల నుంచి ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు . అంగ ఆర్థిక బలము అన్నీ ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ ని దెబ్బతీయటం కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కలసి తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు .ఈ నేపథ్యంలో మొదటి రోజే రంగ ప్రవేశం చేసిన కాంగ్రెస్ నాయకుల దాటికి టిఆర్ఎస్ పార్టీ విలవిలాడే పరిస్థితి కనపడుతుంది…. బీఆర్ఎస్ పార్టీలో అసలు స్వేచ్ఛ లేకుండా పోయిందని బీసీలకు అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇకపోతే నిన్నటి వరకు పువ్వాడ అజయ్ పక్షాన వున్న కార్పొరేటర్ లు అంత ఇప్పుడు తుమ్మల పక్షం లో చేరిపోతారు. కాంగ్రెస్ లో సీట్ల ను ఖరారు చేసుకన్నారు ఖమ్మం రావడం తోనే అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు..