Site icon NTV Telugu

Srinivas Goud: నీటి వాటా, ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ గట్టిగా నిలబడాలి..

Srinivas Goud

Srinivas Goud

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. ఇంతకు ముందు చాలాసార్లు ఇరువురు సీఎంలు భేటీ అయినా… ఇప్పుడు మాత్రం గురుశిష్యులు ప్రచారంలో ఉండి వీళ్లిద్దరు తొలిసారి సీఎంల హోదాలో కలవనుండటంతో తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విభజన సమస్యలు పరిష్కారం కోసం చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపి ముందుగా లేఖ రాయగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

NCERT: మూడు, ఆరు తరగతుల సిలబస్‌లో మార్పులు..త్వరలో మార్కెట్లోకి పుస్తకాలు

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇద్దరు సీఎంలు కలుస్తున్నారు.. ఏమి జరుగుతుందో అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రం ఏర్పడగానే చంద్రబాబు నాయుడు ఏడు మండలాలు కలుపుకున్నారు.. భద్రాచలంలో చాలా భాగం ఏపీలో ఉందన్నారు. ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలని తెలిపారు. అలాగే..
కార్పొరేషన్లలో 70 శాతం మంది ఏపీ వాళ్లే ఉన్నారు.. వారిని వెంటనే అక్కడికి పంపించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉన్న 5 వేల ఎకరాలపై ఏపీ కన్ను వేసింది.. వాటిని వదులుకోవద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

Tamil Nadu: తమిళనాడు డీఎంకేలో కీలక పరిణామం.. ఇద్దరు మేయర్లు రాజీనామా

బాల్క సుమన్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు.. గురు శిష్యులు చాలా సార్లు లోలోపల మాట్లాడుకున్నారని తెలిపారు. ఇప్పుడు బహిరంగంగా భేటీ అవుతున్నారు.. నీటి వాటా, ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ గట్టిగా నిలబడాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడతారని తమకు నమ్మకం లేదని.. గురు శిష్యుల భేటీ తెలంగాణ వనరుల దోపిడీ కోసమేమో.. గురు శిష్యుల భేటీ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతుందేమో.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాట్లాడతారో ప్రభుత్వం బహిర్గతం చేయాలన్నారు.

Exit mobile version