NTV Telugu Site icon

Jagadish Reddy : బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అరెస్ట్..?

Ex Minister Jagadish Reddy

Ex Minister Jagadish Reddy

Jagadish Reddy : బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆందోళనకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్తుండగా, ఘట్కేసర్ వద్ద పోలీసులు జగదీష్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, జగదీష్ రెడ్డికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
Anshu Ambani : 23 ఏళ్ళ తర్వాత హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్

జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఆందోళనలో పాల్గొనడం కోసం కాకుండా, పార్టీ కార్యాలయ పరిస్థితిని పరిశీలించేందుకు మాత్రమే వెళుతున్నానని స్పష్టం చేశారు. పోలీసులు స్పందిస్తూ, ఆయన ప్రయాణానికి ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే ఆయన వెంట ప్రజలు రావడం వల్ల కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. చివరగా, పరిస్థితి అధిక తీవ్రతకు దారితీయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతూ, జగదీష్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన బీఆర్ఎస్ నేతల ఆందోళనకు మరింత ప్రాధాన్యం చేకూర్చింది.

Sankranthi 2025: కంకిపాడులో వైభవంగా ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు..

Show comments