Site icon NTV Telugu

Dasoju Sravan: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చెండాలమైన పనులు

Dasoju

Dasoju

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చెండాలమైన పనులు అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. పార్టీలు మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్.. ఇప్పుడు తన పార్టీలోనే జాయిన్ చేసుకుంటున్నాడని విమర్శించారు. గతంలో చట్టబద్దంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ఎదుట చావు డప్పు కొట్టిన రేవంత్.. ఇపుడు ఇలా చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.

Read Also: Viral Video: ఈగకు ట్రైనింగ్ ఇచ్చిన ఘనుడు.. వీడుడెవడో రాజమోళిని మించేసాడుగా..!

ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి చిల్లర పనులు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ విమర్శలు చేశారు. పార్టీ మారిన వారికి రాజ్యాంగ బద్ధంగానే చావుదెబ్బ తీస్తాం.. డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ వేస్తామన్నారు. గతంలో దానం నాగేందర్ ను బీడీలు అమ్ముకునే వ్యక్తి అన్నారు.. ఈరోజు గాంధీభవన్ లో నాగేందర్ తో బీడీలు అమ్మిస్తావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.? దానం.. గతంలో కాంగ్రెస్ ను వదిలినప్పుడు బీసీలకు కాంగ్రెస్ లో ప్రాధాన్యం లేదు అన్నారు.. మళ్ళీ ఏ ముఖంతో మళ్ళీ కాంగ్రెస్ చెంతకు చేరావని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 119 సీట్లలో 60 సీట్లు బీసీలకు ఇచ్చారని కాంగ్రెస్ లో చేరారా దానం అని ప్రశ్నించారు?. పార్టీ మారిన అందరినీ రాళ్లతో కొడుతావా రేవంత్ రెడ్డి..? పార్టీ ఫిరాయింపులు కాదు.. ప్రజల నమ్మకం నిలుపుకో రేవంత్ రెడ్డి అని సూచించారు.

Read Also: Delhi: ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి..

Exit mobile version