Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ భవన్లో పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ ప్రవీణ్ పోలీసు బృందంతో కలిసి భవన్ లోనికి వెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అనంతరం బాల్క సుమాన్ మీడియాతో మాట్లాడారు. “ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల పాలనలో వారు ఇచ్చిన హామీలపై గట్టిగా మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారు. 2009 నుంచి 2014 వరకు నన్ను టార్గెట్ చేసి జైళ్లలో ఉంచారు. గతంలో 226 కేసు లు పెట్టారు. ఆ రికార్డు బద్దలు కొట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. మొన్న క్యాతన్‌పల్లిలో కూడా నన్ను అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచారు. వాళ్ళ కడుపు మంట చల్లారలేదు ఏమో? మళ్ళీ నా మీద కేసులు పెట్టారు. ఈ అరెస్టులు కేసులు అన్ని మా లీగల్ టీమ్ చూసుకుంటుంది. నేను పారిపోయాను అని కొన్ని ఛానెల్స్ వేస్తున్నాయి. నేను ఎక్కడికి పారిపోలేదు. తెలంగాణ భవన్ లోనే ఉన్నాను. అంతిమంగా న్యాయం ధర్మం గెలుస్తుంది.” అని పేర్కొన్నారు.
ఇక, ఈ నెల 26వ తారీఖున తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై 27వ తేదీ ఉదయం సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 27వ తేదీ నుంచి మూడు రోజులుగా తెలంగాణ భవన్‌లోనే బాల్క సుమన్ ఉంటున్నారు. తెలంగాణ భవన్ బయట మూడు రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కాపుకాస్తున్నారు. ఈరోజు సుమన్ అరెస్ట్ చేసేందుకు ఏసీపీ, పోలీసులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఇంతలో సుమన్ అరెస్ట్ అయ్యారనే వదంతులు వ్యాప్తించాయి. తాను అరెస్ట్ కాలేదని.. ఇక్కడే ఉన్నానని సుమన్ తెలిపారు. అరెస్టు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. ఇంతలో తెలంగాణ భవన్‌కు సుమన్ తరఫు అడ్వకేట్ చేరుకున్నారు. “ముందస్తు బెయిల్ మూవ్ చేశాం.. అది తెలిసే పోలీసులు కావాలని హంగామా చేస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే.. పెట్టాల్సిన కేసులు పెట్టారు. డ్యామేజ్ చేద్దాం అని మాత్రమే అన్నారు సుమన్. ఆ కేసులు వర్తించవు. లీగల్‌గా ప్రొసీడ్ అవుతాం. విచారణకి సహకరిస్తాం అని చెప్పాం.” అని సుమన్ అడ్వకేట్ తెలిపారు. అడ్వకేట్ భవన్‌లోకి వెళ్లిన కొద్ది సమయానికే పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేశారు.
Also Read
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
- Kiren Rijiju: "ఆ విషయంలో తగ్గేదేలే".. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
తాజావార్తలు
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
-
Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?